Vasant Panchami Wishes In Telugu: మీ బంధు మిత్రులకు వసంతపంచమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
జనవరి 26 గురువారం వసంతపంచమి....ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వసంతపంచమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...
Vasant Panchami Wishes In Telugu: ఈ ఏడాది (2023) వసంత పంచమి జనవరి 26 గురువారం వచ్చింది. ఈ రోజునే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం చేస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం. అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు. ఈ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వసంతపంచమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
మీకు, మీ కుటుంబ సభ్యులకు
వసంతపంచమి శుభాకాంక్షలు
చదవులు తల్లి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ
వసంతపంచమి శుభాకాంక్షలు
‘శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ
ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:’
వసంత పంచమి శుభాకాంక్షలు
‘ఐంగ్ ఓం ఐంగ్ నమ:, ఐం ఐంగ్ క్లీం సౌహ’
చదువులతల్లి కరుణాకటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ
వసంతపంచమి శుభాకాంక్షలు
ప్రణోదేవీ సరస్వతీ
వాజేభిర్వాజినీ వతీ ధీనామ విత్ర్యవతు
వసంత పంచమి శుభాకాంక్షలు
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా |
వసంత పంచమి శుభాకాంక్షలు
యాదేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
వసంత పంచమి శుభాకాంక్షలు
Also Read: వారాహి అంటే ఏవరు , ఎందుకంత పవర్ ఫుల్ - పవన్ తన వాహనానికి ఆ పేరెందుకు పెట్టారు!
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా
వసంత పంచమి శుభాకాంక్షలు
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....
వసంత పంచమి శుభాకాంక్షలు
సకలవిద్యా స్వరూపిణి, పరాశక్తి జ్ఞానప్రదాయిని
శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి కరుణా కటాక్షాలు
మీపై ఉండాలని కోరుకుంటూ
వసంత పంచమి శుభాకాంక్షలు
సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్
వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్
వసంత పంచమి శుభాకాంక్షలు
Also Read: జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం - వసంత పంచమి ప్రత్యేకత
నీహార ఘన సార సుధాకరాభ్యాం
కల్యాణదాం కనక చంపక దామ భూషామ్|
ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీం
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై||
వసంత పంచమి శుభాకాంక్షలు
ఓం వాగ్దేవ్యైచ విద్మహే
బ్రహ్మపత్న్యైచ ధీమహీ
తన్నో వాణీ ప్రచోదయాత్
వసంత పంచమి శుభాకాంక్షలు
నీహార ఘన సార సుధాకరాభ్యాం
కల్యాణదాం కనక చంపక దామ భూషామ్|
ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీం
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై||
వసంత పంచమి శుభాకాంక్షలు
శరదిందు వికాస మందహాసాం
స్ఫుర దిందీ వర లోచనాభి రామమ్|
అరవింద సమాన సుందరాస్యాం
అరవిందాసన సుందరీ ముపాసే ||
వసంతపంచమి శుభాకాంక్షలు
వసంతపంచమినే మాఘశుద్ధపంచమి అని, శ్రీ పంచమి అని కూడా అంటారు. వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని, అఖండ విద్య ప్రాప్తిస్తుందని పండితులు చెబుతారు. అందుకే ఈరోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే మంచిదని భావిస్తారు.