మాఘమాసంలో ఐదోరోజు వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు. దీన్నే శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా అంటారు.
ఈ రోజునే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం చేస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం.
సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు. ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి.
శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో పంచమి తిథిరోజు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
సరః అంటే కాంతి..కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.
తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకే ఈ తల్లి చేతిలో ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాలతో అవసరం ఏముంటుంది.
ఈ తల్లి కొలువైన బాసరలో..వసంతపంచమి వేడుకలు మరింత ప్రత్యేకం..