జనవరి 30 వరకూ శ్యామల నవరాత్రులు, వీటి ప్రత్యేకత ఏంటంటే!



శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు..ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా..దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.



ఈ ఏడాది మాఘ గుప్త నవరాత్రులు జనవరి 22 నుంచి ప్రారంభమై 30 వ తేదీ వరకూ ఉంటాయి. శక్తి ఆరాధనకు ఈ తొమ్మిరోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు..అందుకే గుప్త నవరాత్రులు అనే పేరువచ్చింది



శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్టే...శ్యామల నవరాత్రుల్లో కూడా దుర్గమ్మని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు.



శ్యామలాదేవి తిరుగాడే ఈ నవరాత్రుల్లో అమ్మను ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు వారి కోర్కెలు నెరవేరతాయని విశ్వాసం.



మంచి ఉద్యోగం, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి జరుగుతుందని చెబుతారు.



హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. శ్యామలాదేవిని మహామంత్రిణీ దేవి అని కూడా అంటారు.



ఈ గుప్త నవరాత్రులను దేవత కోపాన్ని తగ్గించేందుకు జరుపుకుంటారు. ఈ సమయంలో దేవి తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ణానం , సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది.



గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు మరియు ఆందోళనలు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.



Images Credit: Pinterest