అన్వేషించండి

స్కూల్ కి మొదటి రోజు వెళ్లేముందు విద్యార్థులు పఠించాల్సిన శ్లోకాలు ఇవి!

Spiriatual News: విద్యార్థులు స్కూల్ కి వెళ్లే మొదటి రోజు ఈ శ్లోకాలు పఠించాలి. నిత్యం ఈ శ్లోకాలు పఠిస్తే ఇంకా మంచిది..చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి; విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.
  • వినాయకుడు, సరస్వతి శ్లోకాలు చదివించడం వలన శ్రద్ధ పెరుగుతుంది.
  • ఆంజనేయుడు, దక్షిణామూర్తి శ్లోకాలు కూడా నేర్పించమని సూచించారు.
  • నిత్యం పఠించడం ద్వారా విద్యార్థులకు అఖండ విద్య ప్రాప్తిస్తుంది.

Slokas: వేసవి సెలవులు ముగిసాయి..పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. వేసవి మొత్తం ఆటపాటల్లో మునిగిన విద్యార్థులు మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టడం ప్రారంభమవుతుంది. గడిచిన ఏడాదికన్నా చదువుపై శ్రద్ధపెరగాలని, అఖండ విద్య ప్రాప్తించాలని కోరుతూ మీ పిల్లలతో మొదటి రోజు ఈ శ్లోకాలు చదివించండి. వీటిని నేర్పించి నిత్యం చదివిస్తే చదువుపై శ్రద్ధ మరింత పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

విద్యారంభం సమయంలో వినాయకుడిని ప్రార్థించాలి. అనంతరం సరస్వతీ దేవి శ్లోకాలు పఠించాలి. ఆంజనేయుడు, దక్షిణామూర్తి శ్లోకాలు కూడా విద్యార్థులతో చదివించాలి. సులువుగా నేర్చుకునే శ్లోకాలు ఇవి.

వినాయకుడి శ్లోకం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే 

తెల్లని వస్త్రాలు ధరించి, చంద్రుడి వంటి రంగుతో, నాలుగు చేతులతో, ప్రసన్నమైన ముఖంలో ఉన్నగణేషుడిని ధ్యానిస్తున్నా. అన్ని అడ్డంకులు తొలగిపోవాలి అని అర్థం. విద్యార్థులతో ఈ శ్లోకం నిత్యం చదివించండి.

తలరాత అంటే ఏంటి? దీన్నుంచి తప్పించుకోలేమా , తిరగరాయలేమా?

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ..సర్వకార్యేషు సర్వదా
 
విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి అత్యంత శక్తివంతమైన శ్లోకం ఇది. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా పూర్తికావాలని ఈ శ్లోకం చదువుకుంటారు
 
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి 
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ 
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ

కోరిన వరాలు ప్రసాదించే తల్లీ, సమస్త విద్యలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి నీకు నమస్కారములు. నూతన తరగతిలో అడుగుపెట్టిన సందర్భంగా నాకు ఎప్పుడూ విజయం అనుగ్రహించు అని ప్రార్థించండి

జూన్ 15 స్కూల్స్ రీఓపెన్ రోజు 'సోమవతి అమావాస్య' ! ఈ రోజు విశిష్టత ఏంటి, ఏం చేయాలి?

సరస్వతి దేవి శ్లోకం 

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా  
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా   

ఎవరు.. మల్లెపూవు, చంద్రుడు, మంచు బిందువులా స్వచ్ఛమైన తెల్లని కాంతితో  ప్రకాశిస్తున్నారో..ఎవరు స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించారో, ఎవరు వీణాదండముతో తమ చేతులను అలంకరించుకుని ఉన్నారో, ఎవరు తెల్లని పద్మముపై ఆశీనులై ఉన్నారో, బ్రహ్మ విష్ణు శివుడు, దేవతలతో పూజలందుకునే సరస్వతీ దేవి నాలో మందబుద్ధిని పూర్తిగా తొలగించి రక్షించాలి
 
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 

గురువే సృష్టికర్త, గురువే పరిపాలకుడైన విష్ణువు, గురువే లయకారుడైన మహేశ్వరుడు..అలాంటి పరబ్రహ్మ స్వరూపం అయిన గురువుకి నమస్కరిస్తున్నా అని అర్థం

దక్షిణామూర్తి మంత్రం:

ఓం నమో భగవతే దక్షిణామూర్తయేమహ్యం 
మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా

సరస్వతీ దేవి శ్లోకం

ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనా మవిత్ర్యవతు

ఈ శ్లోకాలు స్కూల్ కి వెళ్లే మొదటి రోజు తల్లిదండ్రులు పిల్లలతో చదివించండి. నిత్యం వారితో చదివించడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. 

బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

విద్యార్థులు స్కూల్ మొదటి రోజు ఏమి చేయాలి?

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యే మొదటి రోజు విద్యార్థులు కొన్ని శ్లోకాలను చదవాలి. ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వినాయకుడు, సరస్వతి, ఆంజనేయుడు, దక్షిణామూర్తి శ్లోకాలను పఠించాలి.

విద్యార్థులు శ్లోకాలు ఎందుకు చదవాలి?

చదువుపై శ్రద్ధ పెరగడానికి, అఖండ విద్య ప్రాప్తించాలని విద్యార్థులు శ్లోకాలు చదవాలి. విఘ్నాలు తొలగిపోయి ఏ పనికైనా ఆటంకాలు లేకుండా పూర్తికావడానికి ఇవి సహాయపడతాయి.

విద్యార్థులు ఏ దేవుళ్ల శ్లోకాలు చదవాలి?

విద్యారంభం సమయంలో వినాయకుడిని ప్రార్థించి, అనంతరం సరస్వతీ దేవి శ్లోకాలు పఠించాలి. ఆంజనేయుడు, దక్షిణామూర్తి శ్లోకాలు కూడా విద్యార్థులతో చదివించాలి.

ఈ శ్లోకాలను నిత్యం చదవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

ఈ శ్లోకాలను నిత్యం చదవడం ద్వారా విద్యార్థులలో చదువుపై శ్రద్ధ పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇది ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా పూర్తికావడానికి సహాయపడుతుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
ఆగస్టు 12 అమావాస్య: మీ రాశి ప్రకారం ఈ మొక్క నాటి గ్రహ దోషాలు తొలగించుకోండి!
ఆగస్టు 12 అమావాస్య: మీ రాశి ప్రకారం ఈ మొక్క నాటి గ్రహ దోషాలు తొలగించుకోండి!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Embed widget