News
News
X

Srivari Kalyanam : అమెరికాలో కన్నుల పండువగా శ్రీనివాసుడి కల్యాణం, తరలివచ్చిన భక్తజనం

Srivari Kalyanam : అమెరికాలో శ్రీనివాసుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. టీటీడీ, ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా కల్యాణం జరిపించారు.

FOLLOW US: 
Share:

Srivari Kalyanam : అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.  ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణోత్సవం ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ పుణ్యాహవాచనం పండితులు నిర్వహించారు. 

విశ్వక్సేన ఆరాధన 

విశ్వక్సేనుడు వేంకటేశ్వర స్వామి సర్వసైన్యాధిపతి. స్వామివారి కల్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు, ఊరేగింపు ముందు ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తారు. కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమకుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లి శుద్ధి చేశారు. అంకురార్పణ ఏదైనా పుణ్య కార్యానికి ముందు నిర్వహించే వైదిక క్రతువు. ఈ క్రతువులో అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. కల్యాణంలో ఇది మరొక ప్రధాన భాగం. అర్చకులు  పవిత్రమైన కంకణాలను స్వామి, అమ్మవార్ల  ఉత్సవ విగ్రహాల చేతులకు కడతారు. పవిత్రమైన అగ్నిని వెలిగించి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠానంతరం దేవతలకు వేద పండితులు కొత్త పట్టువస్త్రాలను సమర్పించారు. 

కల్యాణం 

తాళ్లపాక వంశస్థులు అమ్మవారి తరపున కన్యాదానం చేసే ఆచారం ఉంది. ఇందుకోసం  మహా సంకల్పం జరిగింది. కల్యాణంలో  కన్యాదానానికి  ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ భగవంతుడు అతని భార్యల గోత్ర ప్రవరాలను పూజారులు పఠించారు. వేంకటేశ్వరుడు తన ప్రియమైన భార్యలకు పవిత్ర మంగళ సూత్రాలను కట్టిన మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇది సాధారణంగా దక్షిణ భారత హిందూ వివాహాల సమయంలో నిర్వహించబడే ప్రముఖమైన క్రతువు. ఇందులో స్వామివారు  అతని దేవేరులు ఒకరికొకరుఎదురుగా పూల బంతులు కొబ్బరికాయలతో ఆడుకున్నారు. అనంతరం దేవతామూర్తులకు పూలమాలలు మార్చి వివాహం జరిపించారు.  శ్రీదేవి కుడి వైపున, భూదేవి  ఎడమ వైపున ఉంచారు. చివరగా కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి తో కల్యాణోత్సవం ముగిసింది.

శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని భక్తులు నేత్రపర్వంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో  టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి ఛైర్మన్ మేడపాటి వెంకట్,  ఎస్వీబీసీ  డైరెక్టర్  శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు.

Also Read : TTD New Rule For NRIs : ఇకపై ప్రవాస భారతీయులకు కొండపైనే దర్శన టోకెన్లు - ఈ పత్రాలు ఉంటే చాలు !

Published at : 19 Jun 2022 02:06 PM (IST) Tags: devotees America ttd Tirumala Srivaru Srivari Kalyanam San Francisco

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు