అన్వేషించండి

YSRCP: జగన్ సహా అంతా పార్ట్ టైమ్ పాలిటిక్సే - వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడు గాడిన పడుతుంది?

Jagan: ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పార్ట్ టైమ్ పాలిటిక్స్ తో టైం పాస్ చేస్తోంది. జగన్ సహా నేతలెవరూ పూర్తి స్థాయిలో యాక్టివ్‌గా లేరు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

YSRCP part time politics: ఏపీలో అధికార పార్టీ అగ్రనేతలు తమ ఎమ్మెల్యేలను దారిన పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అలాంటి రాజకీయ పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లోలేదు. 2024 ఎన్నికల్లో  ఊహించని ఓటమి  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారు. బెంగళూరుకు స్థిరనివాసం మార్చారు. వారానికి రెండు, మూడు రోజులే తాడేపల్లికి వస్తున్నారు. సీనియర్ నేతలు కూడా అలాగే ఉన్నారు. కొంత మంది ప్రెస్ మీట్లకు పరిమితమైతే చాలా మంది ఆ పని కూడా చేయడం లేదు. దీంతో వైసీపీ రాజకీయం పూర్తి స్తబ్దుగా మారిపోయింది. 

బుగ్గన నుంచి ధర్మాన వరకూ అందరూ సైలెంట్

పార్టీ ఓడిపోయాక.. కొంత మంది నేతలు పార్టీ వీడిపోయారు. పార్టీలో ఉన్న వారు యాక్టివ్ గా లేరు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ధర్మాన సహా ఎవరూ రాజకీయాలు చేయడం లేదు. బొత్స సత్యనారాయణ అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెడుతున్నారు. దీనికి కారణం జగన్ తీరేనని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎవరి సూచనలను తీసుకోలేదు.  కనీసం ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోలేదు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. సీనియర్ నేతలు కూడా జగన్ పరిపాలన తీరుతో నొచ్చుకున్నారు. అందుకే తర్వాత సైలెంట్ అయ్యారు. 

కేసుల భయంతో  కొంత మంది ఆజ్ఞాతం
 
వైసీపీలో సీనియర్ నేతలు బయటకు రావడం లేదని పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం  ఇటీవల జగన్ తాడేపల్లికి పిలిపించుకుని క్లాస్ పీకుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటి నేతలు నోరు మెదిపితే కేసులు పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. జోగి రమేష్ నుంచి రోజా వరకూ అందరి కథ అదే. జోగి రమేష్ కొన్నాళ్లు జైలుకెళ్లకుండా పోరాడారు కానీ తర్వాత తప్ప లేదు.  కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా నోరున్నా నెతలంతా ఇప్పుడు వీలైనంత మౌనం పాటిస్తున్నారు. పేర్నినానితో పాటు అంబటి రాంబాబు మాత్రమే ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. వీరంతా గతంలో టీడీపీ నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన వారే.   

సజ్జల తీరుతో మరికొంత మంది అసంతృప్తి

వైఎస్ఆర్‌సీపీలో సీనియర్ నేతల చురుకుతనం లేకపోవడానికి మరో ప్రధాన కారణం  సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం.  జగన్ చుట్టూ ' కోటరీ ఉందని .. వారే  నిర్ణయాలు తీసుకుంటూ, సీనియర్ నేతలు, కార్యకర్తలు జగన్‌ను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ కోటరీకి నాయకుడు సజ్జల అని చెబుతారు.  పార్టీ పరమైన నిర్ణయాలను జగన్ పట్టించుకోవడం లేదు. అంతా సజ్జలే చేస్తున్నారు. సజ్జల ఆదేశాలను తాము పాటించడం ఏమిటని సీనియర్ నేతలు కార్యక్రమాలు తగ్గించుకున్నారు. 

జగన్ యాక్టివ్ అయితేనే మిగతా లీడర్లు !

పార్టీ అధినేత జగన్ గతంలోజిల్లాలు పర్యటిస్తామని చెప్పారు.కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోవడం లేదు. జగన్ పార్ట్ టైమ్ గా రాష్ట్రానికి వచ్చి పోతూంటే..తాము మాత్రం ఎందుకు కష్టపడాలని సీనియర్లు అనుకుంటున్నారు. వారందరికీ జగన్ మళ్లీ పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తేనే ధైర్యం వస్తుంది. కానీ జగన్ పాదయాత్ర వరకూ మళ్లీ పూర్తి స్తాయి రాజకీయాలు చేసే అవకాశాల్లేవని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Embed widget