అన్వేషించండి

VijayaSai Reddy 'ప్యాకేజీ పొత్తు, 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది' - సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటెయ్యాలని విజయసాయి పిలుపు

AP Politics: టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు.

Vijayasai Reddy Tweet on Tdp Janasena And Bjp Alliance: వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు  ఖరారైన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. 2014 - 19 మధ్య కాలంలో రాష్ట్రానికి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్ధాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది.? అంటూ ప్రశ్నించారు. ఇది మరో ప్యాకేజీతో ఏర్పడిన పొత్తు అని మండిపడిన ఆయన.. మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. 'ఏపీలో సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటు వెయ్యాలి.' అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అటు, ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రచారంలో వేగం పెంచారు. 'వైనాట్ 175' లక్ష్యంగా తమదైన రీతిలో ప్రజలతో మమేకమవుతున్నారు. 

అటు, పవన్ కాపులను మోసం చేశారని ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. తాను సీఎం కాలేనని, చంద్రబాబుకే సీఎం అయ్యే అర్హత ఉందని పవన్ చెబుతున్నారని.. చంద్రబాబుకు కాపులందరూ ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు వేధించినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కాపులను తిట్టిన వారితో పవన్ ఎందుకు కలిశారని అన్నారు. కాపు సోదరులను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంత దగా చేస్తున్నారో గుర్తించాలని పేర్కొన్నారు.

ఆ పొత్తు ఖరారు

అటు, టీడీపీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. అధికారిక ప్రకటనే తరువాయి. గురువారం రాత్రి జరిగిన చర్చల్లో ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఇన్ని రోజులు సాగిన పొలిటికల్‌ సీరియల్‌కు ఇవాళ పుల్‌స్టాప్‌ పడనుంది. 2014 సీన్ ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కానుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఓ అవగాహనకు వచ్చాయని సమాచారం. మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేయనున్నాయి. 175 అసెంబ్లీ సీట్లన్న ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాల్లో పోటీ  చేసే ఛాన్స్ ఉంది. 25 పార్లమెంట్‌ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే... మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. అంటే ఐదు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ పడనుంది. అదే టైంలో 24 ఎమ్మెల్యే సీట్లలో జనసేన పోటీ చేయనుంది. ఆరు సీట్లు బీజేపీకి కేటాయించనున్నారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు.

Also Read: AP Elections 2024: ఎన్నికల టైంలో 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే మీరు బుక్ అయినట్టే! సరకులకీ ఓ లెక్క ఉందండోయ్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న బీజేపీ?
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న బీజేపీ?
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న బీజేపీ?
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న బీజేపీ?
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
Embed widget