అన్వేషించండి

YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?

YSRCP: వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లి విజయమ్మ లేఖపై జగన్ స్పందనను బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయి.

YS family property dispute is likely to escalate further: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల చెబుతున్న మాటల్ని సమర్థిస్తూ జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రకటనలు అన్నీ అసత్యాలని విజయలక్ష్మి తన బహిరంగలేఖలో తేల్చేశారు. ఆస్తుల వివాదంలో అసలేం జరిగిందో చెప్పారు. ఆమె చెప్పిన దాని ప్రకారం షర్మిలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి తాను షర్మిలవైపు ఉన్నానని చెర్పారు. అంటే ఆస్తుల విషయంలో షర్మిలకు జగన్ అన్యాయం చేస్తున్నారని సొంత తల్లినే నేరుగా చెప్పినట్లయింది. ఇప్పుడీ అంశం ప్రజల్లోకి వెళ్లిపోయింది. 

బహిరంగమైన కుటుంబ ఆస్తుల వివాదం

నాలుగు గోడల మధ్య ఆస్తుల పంచాయతీ తేల్చుకుంటే బయట అసలు చర్చ జరిగేదే కాదు. నిజానికి ఇలాగే పరిష్కరించుకున్నారని కానీ జగన్ అడ్డం తిరగడం వల్లే సమస్య వచ్చిందని ఇప్పుడు కోర్టుకు వెళ్లడం వల్ల బహిరంగమయిందని వైఎస్ విజయమ్మ లేఖతో స్పష్టమయింది. మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఆస్తుల వివాదం పబ్లిక్ లోకి వస్తే ఖచ్చితంగా అది  హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. కుటుంబ పెద్దగా ఉన్న విజయమ్మ కూా ఆస్తుల్ని నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలని లేఖ ద్వారా తేల్చేశారు. కానీ దానికి జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. స్వయంగా ఎన్సీఎల్టీలో కూడా పిటిషన్ వేశారు.

ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !

జగన్ తల్లి మాట వింటారా ? 

ఇప్పుడు అందరి దృష్టి జగన్ మోహన్ రెడ్డి వైపే ఉంది. ఆస్తుల వివాదాన్ని తన బిడ్డలే పరిష్కరించుకుంటారని విజయమ్మ చెప్పింది. ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ అంశంపై ఇద్దరూ ఎంత త్వరగా రాజీకీ వస్తే ఇద్దరికీ అంత మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నదే చేసేలా ఉంటుందని ఎవరైనా రాజీపడేలా ఉండదని అనుకోవచ్చు. అన్నీ ఆలోచించిన తర్వాతనే తల్లి విజయమ్మతో పాటు సోదరి షర్మిలపై కోర్టుకెళ్లారని .. ఇందులో ఇక వెనక్కి తగ్గేదేమీ ఉండదని అంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు పంచి నఆస్తులు కాకుండా తన వ్యాపారాల నుంచి ఒక్క రూపాయి కూడా షర్మిలకు ఇవ్వాలని ఆయన అనుకోవడం లేదు. అది తన స్వార్జితం అని అంటున్నారు. అందుకే తల్లి చెప్పినప్పటికీ ఆస్తులు పంచే అవకాశాలు ఉండవని వివాదాన్ని కొనసాగిస్తారని.. కోర్టులోనే తేల్చుకుంటారని అంటున్నారు. 

ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న

ఇడుపులపాయలో జగన్ - మీడియా ముందు ప్రకటన చేస్తారా ?

ఆస్తుల వివాదంపై ఇక పార్టీ నుంచి ఎవరూ మాట్లాడవద్దని కోర్టులోనే వాదనలు వినిపిద్దామని వైసీపీ మూడు రోజుల కిందట ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో వైసీపీకి కొన్ని చిక్కులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జగన్ పులివెందుల పర్యటనకు వచ్చారు. అక్కడ కీలకమైన ప్రకటన చేసేందుకే వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయమ్మ లేఖపై స్పందించి ఆస్తుల వివాదాన్ని పరిష్కరించకుంటారా లేకపోతే.. తల్లి కూడా సోదరితో జత కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించి.. తన బాట తనదేనని చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
IND v NZ 3rd ODI Highlights: స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
Ileana Suffering with BDD : బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP DesamKerala CM Convoy Accident | సీఎం పినరయి విజయన్ కు తృటిలో తప్పిన ప్రమాదం | ABP Desamవిజయ్‌ పైన కూడా ఏసేశారుగా! తలపతికి పవన్ చురకలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
IND v NZ 3rd ODI Highlights: స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
Ileana Suffering with BDD : బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Suriya: జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
Telangana News: పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
Kapil Dev Meets Chandrababu: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
Mobile Phone Recovery: మొబైల్స్ రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు, వీటి విలువ అన్ని కోట్ల రూపాయలా!
మొబైల్స్ రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు, వీటి విలువ అన్ని కోట్ల రూపాయలా!
Embed widget