అన్వేషించండి

Prakash Raj : పవన్‌ను రెచ్చగొడుతున్న ప్రకాష్ రాజ్ - ఆయన వెనుక ఆ పార్టీ ఉందా ?

Pawan : పవన్ కల్యాణ్‌ను రెచ్చగొట్టేందుకు ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆయన ఎందుకు తలదూరుస్తున్నారు ?

Why is Prakash Raj provoking Pawan Kalyan :  జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి హఠాత్తుగా ట్వీట్లు చేస్తున్నారు. ఓ ట్వీట్‌కు సంబంధించి పవన్  ఆగ్రహంగా స్పందించడంతో తాను విదేశాల్లో ఉన్నానని వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. మళ్లీ ఒక్క రోజులోనే హీరో కార్తీ అంశంపై స్పందించారు. తప్పులేకపోయినా సారీ చెప్పించుకున్నారని మండిపడ్డారు. పవన్  ను రెచ్చగొట్టేందుకు ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా చేస్తున్నారు. ఆయన వెనుక వైసీపీ ఉందా ?

హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ భావజాలం

కారణం ఏదైనా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీని.. బీజేపీ హిందూత్వ విధానాల్ని విమర్శిస్తూ ఉంటారు. బీజేపీతో  చాలా లొల్లి పెట్టుకున్నారు కూడా. చివరికి ఆయన బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయనకు కనీస ఓట్లు రాలేదు. అంటే జనం ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల రాజకయాల వైపు రాలేదు కానీ.. బీజేపీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటూ వచ్చారు. కొంత కాలంగా రాజకీయాలపై పెద్దగా మాట్లాడటం లేదు. హఠాత్తుగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశంపై స్పందించారు. పవన్ ను విమర్శించారు. దానికి పవన్ రిప్లయ్ ఇచ్చారు. దీనిపై 30వ తేదీ తర్వాత మరింత విపులంగా స్పందిస్తానని ఆయన అంటున్నారు. పవన్ తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అంటున్నారు. 

Also Read: Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు 

మళ్లీ హఠాత్తుగా కార్తీ అంశంతో ట్వీట్

పవన్ కల్యాణ్ ప్రకాష్ రాజ్ తో పాటు కార్తీని కూడా విమర్శించారు. అక్కడ మిస్ అండస్టాండింగ్ జరిగిందని పవన్ కూడా  పరోక్షంగా అంగీకిరంచారు. కార్తీకి కొత్త సినిమా విషయంలో బెస్ట్ విషెష్ చెప్పారు. అంతటితో ఇద్దరి మధ్య గుడ్ గెస్చర్‌తో కథ సమాప్తం అయింది. కానీ దీన్ని ప్రకాష్ రాజ్ మళ్లీ రేపే ప్రయత్నం చేశారు. కారణం లేకపోయినా సారీ చెప్పించుకున్నారని .. ఆయన ట్వీట్ చేశారు. సహజంగానే ఇది రెచ్చగొట్టడం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రకాష్ రాజ్‌కు అంత అవసరం ఏమిటి ? 

Also Read: వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి గుర్తించి పలుమార్లు వెనక్కి పంపించాం - కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

వివాదాలను ఇష్టపడుతున్నారా.. వైసీపీకి మద్దతుగా వస్తున్నారా ?

ప్రకాష్ రాజ్ సహజంగా వివాదాలను ఇష్టపడతారు. వార్తల్లో ఉండాలనుకుంటారు. అందుకే పవన్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి మెగా కుటుంబంతో ప్రకాష్ రాజ్ సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు నాగబాబు ఎంతో  శ్రమించారు. కానీ ఆయన వివాదాస్పద వైఖరి కారణంగానే ఓటమి ఎదురయింది. ఇప్పుడు ఆ మంచి సంబంధాలను కూడా  గుర్తుంచుకోకుండా.. ఏపీ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టే  ప్రయ్తనం చేస్తున్నారు. దీని  వెనుక వైసీపీ ఉండి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ప్రకాష్ రాజ్ కు ఏపీతో అసలు సంబంధంలేదు. ఆయన పూర్తిగా కన్నడిగుడు. ఆయనకు అసలు ఇక్కడి రాజకీయాల్లో వేలు పెట్టి పవన్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం వెనుక ఖచ్చితంగా ఎజెండా ఉందని ఎక్కువ మంది నమ్ముతారు. 

 

టాప్ హెడ్ లైన్స్

SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget