Why AP Needs YS Jagan : వై ఏపీ నీడ్స్ జగన్ ? - వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల ఎజెండా ఖరారు !
వైసీపీ ప్రచార వ్యూహం ఖరారుమళ్లీ జగనొస్తేనే సంక్షేమం!మళ్లీ జగనొస్తేనే అభివృద్ధి!మళ్లీ జగన్ వస్తేనే శాంతిభద్రతలు!మళ్లీ జగన్ వస్తేనే పరిశ్రమల వెల్లువ ! వై ఏపీ నీడ్స్ జగన్ ? పేరుతో ప్రజల్లోకి !
Why AP Needs YS Jagan : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ మరోసారి అధికారం సాధించేందుకు ప్రచార ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది. గతంలో రావాలి జగన్ - కావాలి జగన్ అనే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయింది. అధికారం సాధించగలిగారు. ఇప్పుడు ఆ క్యాప్షన్ వర్కవుట్ కాదు. అందుకే కొత్త ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. వై ఏపీ నీడ్స్ జగన్ ? అనే క్యాప్షన్ తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఐ ప్యాక్ టీం ఎంతో మేధోమథనం చేసి.. ఏపీ లోని పూర్తి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి ఈ ప్రచార కార్యక్రమం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ అనే తెల్లదోమ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోంది, అందుకే క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవ - పవన్ కల్యాణ్
ఏపీలో జగన్ అవసరం చాలా ఉందంటున్న వైఎస్ఆర్‌సీపీ
విభజిత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉందని ఇప్పుడు అధికారం జగన్ చేతుల్లోనుంచి వెళ్లిపోతే ఏపీ అల్లకల్లోలం అయిపోతుందన్న ఉద్దేశంతో వైఎస్ఆర్‌సీపీ ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో ..ఈ ప్రచారం ద్వారా ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. మూడు రాజధానులు దగ్గర్నుంచి జిల్లాకో మెడికల్ కాలేజీ.. పరిశ్రమల స్థాపన.. ముఫ్పై లక్షల ఇళ్ల నిర్మాణం .. సంక్షేమ పథకాలు ఇలా ప్రతీ విషయంలోనూ జగన్ మార్క్ కనిపిస్తోందని.. మళ్లీ ప్రభుత్వం మరితే అవన్నీ ఆగిపోతాయని చెప్పబోతున్నారని అంటున్నారు.
టీడీపీ ప్రచారానికి కౌంటర్ !
రాష్ట్రం సర్వ నాశనం అయిపోయిందని.. ప్రజల బతుకుల్ని పీల్చి పిప్పి చేసేశారని.. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే చంద్రబాబు రావాలని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా అంచునకు చేరిందని.. ప్రజల్ని కొట్టి. .. పెద్దలకు పెడుతున్నారని..రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నింటినీ తరిమేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీడీపీ చేస్తన్నవన్నీ అబద్దపు ప్రచారాలేనని.. అభివృద్ధికి ఏపీ దూసుకెళ్తోందని.. జీఎస్‌డీపీలో రాష్ట్రం దేశ సగటు కన్నా ఎక్కువ అభివృద్ధి సాధి్తోందని అంటున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే ప్రచారం ద్వారా.. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు.
18 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ - గడప గడపకూ వర్క్ షాప్‌లో సీఎం జగన్ సీరియస్ !
నెగెటివ్ సౌడ్ వస్తుందా ?
ఇక జగన్ అవసరం రాష్ట్రానికి ఏముంది అని ... వైసీపీ ప్రచారానికి టీడీపీ కౌంటర్ ప్రారంభిస్తే ... ఈ క్యాంపెయిన్ నెగెటివ్ టర్న్ తీసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి జగన్ అవసరం ఇంకేముందని.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఇంకో అవకాశం ఎందుకని టీడీపీ కౌంటర్ ఇచ్చే చాన్స్ ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు కౌంటర్ ఇవ్వకుండా ఉంటాయని ఎవరూ అనుకోరు. వారికి కౌంటర్ ఇవ్వడానికి తమ దగ్గర పూర్తి స్థాయి స్టఫ్ ఉండే ఉంటుందని.. వైసీపీ క్యాడర్ భావిస్తోంది. మొత్తానికి ఓ ప్రచార క్యాప్షన్ మాత్రం వైసీపీకి రెడీ అయిపోయిందని భావిస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial