పెద్దపులి అటవీ ప్రాంతం నుంచి ఇళ్ల మధ్యలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మన్యం పులి దాడి చేసి ప్రాణాలు తీస్తుందేమోనని వారు వణికిపోతున్నారు.
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Eluru News | ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీ సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీ అధికారులు, ఢిల్లీ రెస్క్యూ బృందం నిఘా పెంచి స్థానిక ప్రజలను అప్రమత్తం చేశాయి.

- ఏలూరు జీలుగుమిల్లిలో పెద్దపులి సంచారం, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
- పులి అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించి, ఆవును చంపింది.
- అటవీ, పోలీసు బలగాలు పులి కదలికలపై నిఘా ఉంచాయి.
- ప్రత్యేక నిపుణుల బృందం, రెస్క్యూ టీమ్‌లు పులిని పట్టుకునేందుకు సిద్ధం.
Tiger In Eluru District | జీలుగుమిల్లి: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ అటవీ ప్రాంతం చుట్టుపక్కల సంచరించిన పెద్దపులి ఈసారి ఏకంగా ఇళ్ల మధ్యకి రావడంతో ప్రజలు వణికిపోతున్నారు. అడవి మార్గంలో కాకుండా నేరుగా జనావాసాలు తిరిగే ప్రాంతాల గుండా ఈ మన్యం పులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దాడి చేసి, ప్రాణాలు తీస్తుందేమోనని ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు.
కొత్తూరు మీదుగా జీలుగుమిల్లి మండలానికి వచ్చిన పులి
బొత్తప్పగూడెం సమీపంలోని సంగం వాగు అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన పులి, జీలుగుమిల్లిలోని ప్రసిద్ధ జగదాంబ అమ్మవారి ఆలయ ప్రాంతం మీదుగా సంచరిస్తూ చివరకు చంద్రమ్మ కాలనీ సమీప అటవీ ప్రాంతంలో మకాం వేసింది. గత కొంతకాలంగా సీతానగరం వద్ద గోదావరి నదిని ఈదుకుంటూ డెల్టాలోకి ప్రవేశించిన ఈ పులి, తూర్పు గోదావరి జిల్లా తల్లపూడి, దేవరపల్లి, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సంచరించి పాపికొండల అడవులకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి వేలేరుపాడు మండలం కొత్తూరు మీదుగా జీలుగుమిల్లి మండలంలోని రాచన్నగూడెం వద్దకు చేరింది. అక్కడ ఆవును వేటాడి చంపి, తాజాగా జనావాసాల మధ్యలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ తెలిపింది.
పులి సంచారంతో అప్రమత్తమైన అటవీ మరియు పోలీసు బలగాలు చంద్రమ్మ కాలనీ సమీప అటవీ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. డ్రోన్ కెమెరాలు, నైట్ విజన్ ట్రాప్ కెమెరాల సాయంతో పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక మత్తు ఇంజెక్షన్ నిపుణుల బృందంతో పాటు రెస్క్యూ టీమ్‌లు బోన్లతో సిద్ధంగా ఉన్నాయి. జీలుగుమిల్లి, చంద్రమ్మ కాలనీ, బొత్తప్పగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆటోలపై మైకులు, దండోరా ద్వారా గ్రామాల్లో నిరంతరం అప్రమత్తత ప్రచారం నిర్వహిస్తున్నారు.
Frequently Asked Questions
జీలుగుమిల్లి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
పులి ప్రస్తుతం ఏ ప్రాంతంలో సంచరిస్తోంది?
కొత్తూరు మీదుగా జీలుగుమిల్లి మండలానికి వచ్చిన పులి, జగదాంబ అమ్మవారి ఆలయ ప్రాంతం గుండా సంచరిస్తూ ప్రస్తుతం చంద్రమ్మ కాలనీ సమీప అటవీ ప్రాంతంలో మకాం వేసింది.
పులిని పట్టుకోవడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అటవీ, పోలీసు బలగాలు చంద్రమ్మ కాలనీ సమీప అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. డ్రోన్ కెమెరాలు, నైట్ విజన్ ట్రాప్ కెమెరాలతో నిఘా ఉంచుతూ, ప్రత్యేక మత్తు ఇంజెక్షన్ బృందాన్ని సిద్ధం చేశారు.
ప్రజలకు అటవీశాఖ అధికారులు, పోలీసులు ఏమని హెచ్చరించారు?
జీలుగుమిల్లి, చంద్రమ్మ కాలనీ, బొత్తప్పగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఆటోలపై మైకులు, దండోరా ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























