By: ABP Desam | Updated at : 18 Mar 2023 07:00 AM (IST)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం ? టీడీపీ పుంజుకున్నట్లేనా ?
MLC Result Analasys : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ, పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎన్నికలు వరుసగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. సునాయాసంగా విజయం సాధించారు. ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా అనూహ్యంగా రెండు స్థానాల్లోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులే గెలుపొందారు. కానీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ? ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందా ? టీడీపీ పుంజుకుందా ?
స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ హవా !
స్థానిక సంస్థల పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీ హవా చూపించింది. అన్ని స్థానాలను గెల్చుకుంది. అయితే ఈ గెలుపు పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినది కాదు.ఎందుకంటే వైసీపీ తరపున గెలిచిన ఎంపీటీసీలు.. జడ్పిటీసీలు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాబట్టి వారు తప్ప మరెవరూ గెలవరు. కానీ ఉపాధ్యాయ పట్టభద్రుల విషయంలో మాత్రం వైసీపీ మ్యాజిక్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరే్కతతో ఉన్నారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి మరీ గెలిపించుకుంది. ప్రైవేటు ఉపాధ్యాయుల ఓట్లను వైసీపీ బాగా పొందిందని.. ప్రభుత్వ ఉపాధ్యాయుల మద్దతు పొందలేదని కొంత మంది విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనా గెలుపు గెలుపే. ఓట్లు తక్కువ అయినా వైసీపీ ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకుంది.
పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలతో వైసీపీకి షాక్ !
అయితే ప్రజాభిప్రాయం వెల్లడవుతుందని భావిస్తున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీకి షాక్ తగలడం మాత్రం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీని భారీ తేడాతో ఓడిపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరం. ఇక కంచుకోటల్లాంటి రాయలసీమ జిల్లాల్లోనూ పట్టభద్రులు టీడీపీవైపే మొగ్గారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే కాదు తూర్పు రాయలసీమ, ప శ్చిమలోనూ వైఎస్ఆర్‌సీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ.. పనులు ఆశించినట్లుగా లేకపోవడంతో గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా పేరున్న జిల్లాల్లోనూ వైఎస్ఆర్‌సీపీకి ఎదురు గాలి వీచిందని నమ్ముతున్నారు. కడప, కర్నూలు, అనంతపురం. ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ పట్టు గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు జిల్లాలకు కలిపి టీడీపీకి ఉన్నది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా అనంతపురం జిల్లా నుంచే ఉన్నారు. అంటే ఏకపక్షంగా పట్టభద్రులు ఓటింగ్ చేయాల్సిన నియోజకవర్గం. కానీ ఫలితాలు అలా రాలేదు.
సమీక్ష చేసుకుని దిద్దుకుంటేనే
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తాము ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నామన్న ఓ రకమైన అభిప్రాయంలో ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని తాజా ఎమ్మెల్సీ పరిణామాలతో అర్థమైపోతుంది. ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు కాబట్టి.. అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని అనుకోవచ్చు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంటుందా అన్నది ఆసక్తికర అంశం. ప్రత్యర్థులపై రాజకీయ దాడులు ఆపి ప్రజలకు అత్యధిక సమయం కేటాయించాలన్న విశ్లేషణ ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తే.. అది వారికి బలం ఇస్తుంది. కానీ టార్గెట్ చేసిన వారికి మైనస్ అవుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేని సమయంలో.. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సమీక్షించుకుని.. లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం అధికార పార్టీపై పడిందని అనుకోవచ్చు.
TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?
TDP Vs Janasena: జనసేన - బీజేపీ మధ్య గ్యాప్‌కు కారణం ఎవరు ? పవన్ పట్టించుకోలేదా ? బీజేపీ నిర్లక్ష్యం చేసిందా ?
Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు
నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్
TSPSC Paper Leak Case : పేపర్ లీక్ కేసు సీబీఐకి ఇవ్వాలా వద్దా ? హైకోర్టు చెప్పింది ఏమిటంటే ?
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!