Mamata EVM : యూపీ ఈవీఎంల ఫోరెన్సిక్ ఆడిట్ కోరాలి - అఖిలేష్‌కు మమతా బెనర్జీ సలహా
యూపీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల ఫోరెన్సిక్ ఆడిట్ కోరాలని అఖిలేష్‌కు మమతా బెనర్జీ సలహా ఇచ్చారు. అవకతవకలు జరిగాయన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ( UP Elections ) వచ్చిన ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ( Mamata benarjee ) అనుమానం వ్యక్తం చేశారు. "ఓట్ లూట్" ( VOTE LOOT ) జరిగిందని ఆమె అంటున్నారు. ఈ అంశంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఖచ్చితంగా విచారణ కోరాలని ఆమె సూచించారు. అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఫోరెన్సిక్ టెస్ట్ చేయించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంల ( EVM ) చోరీ చోటుచేసుకుందంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలను ఆమె బలపరిచారు. అఖిలేష్ ఎంత మాత్రం అధైర్యపడకుండా, ఈవీఎం మిషన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని కోరాలని ఆమె సలహా ఇచ్చారు.
మెజార్టీలో నేషనల్ ఛాంపియన్ ఆ బీజేపీ ఎమ్మెల్యేనే ! ఎన్ని లక్షల ఓట్ల మెజార్టీ అంటే ?
ప్రతీ సారి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే వస్తున్నాయి. ఈవీఎంల పని తీరుపై మమతా బెనర్జీ మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని బెంగాల్ ఎన్నికల సమయంలోనూ మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, జేడీఎస్, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలన్నీ ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొత్తం 17 పార్టీలు ఈ డిమాండ్ తో న్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
"సాహెబ్"కు కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ! అలా జరిగే చాన్సే లేదట
ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులోనూ పోరాడాయి. ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని .. ఇదే కారణంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్ పద్ధతిని వినియోగిస్తున్నాయని విపక్షాలు అంటున్నాయి. అయితే వారి పోరాటం ఎప్పటికప్పుడు నిష్ఫలం అవుతోంది. గెలిచిన పార్టీలు ఈవీఎంల పనితీరుపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. ఓడిపోయిన తర్వాత మాత్రమే ఈవీఎంలను నిందిస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీ ఈవీఎంలను నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈవీఎంలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిషేధం డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం అలా సాగుతోంది.