అన్వేషించండి

Vijay One Man Army: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వన్ మ్యాన్ ఆర్మీ - నిజమైన పాలనా ప్రతిభనా? పిఆర్ విన్యాసమా?

Vijay Political Style: తన పరిపాలనతో విజయ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. టాప్ త్రీ పాపులర్ లీడర్లలో ఒకరుగా ప్రచారం పొందుతున్నారు.

TVK National Politics PM Race Speculations: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమిళగ వెట్రి కజగం అధినేత సి. జోసెఫ్ విజయ్ నడుచుకుంటున్న తీరు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. సరిగ్గా  ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ తరహాలోనే అర్ధరాత్రి ఆసుపత్రులు, సచివాలయ విభాగాలు, చెన్నై మెట్రో, స్థానిక రవాణా ప్రాజెక్టులపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా హంగూ ఆర్భాటాలకు పోకుండా, శాసనసభా పరిధిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలిస్తుండటంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా తారస్థాయికి చేరింది.

దేశవ్యాప్తంగా మారుమోగుతున్న  విజయ్ పేరు

సామాజిక మాధ్యమాల్లో, యువతలో ఆయనకున్న విపరీతమైన ఆదరణ కారణంగా.. దేశవ్యాప్తంగా విజయ్ పేరు మారుమోగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ శక్తులతో సత్సంబంధాలు నెరపుతూ ప్రతిపక్షాల వరుసలో బలమైన నేతగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా, జాతీయ మీడియాలోనూ రాబోయే రోజుల్లో ఆయన  ప్రధానమంత్రి  రేసులో ఉండగల సమర్థుడంటూ విశ్లేషణలు వెలువడటం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ప్రజాదరణ ఆయన సత్వర ప్రజానుకూల పాలనకు సంకేతమా లేక ఇమేజ్ బిల్డింగ్ కోసం పక్కాగా రూపొందించిన పబ్లిసిటీ వ్యూహమా అనే కోణంలో  చర్చలు ప్రారంభమయ్యాయి. 

పబ్లిసిటీ పాలన అని విమర్శిస్తున్న డీఎంకే

తమిళనాడులోని ప్రతిపక్షమైన డిఎమ్‌కే  నేతలు విజయ్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో రైలు ప్రయాణాలు, ఆకస్మిక తనిఖీలు కేవలం కెమెరా లైట్ల కోసమే జరుగుతున్న  పబ్లిసిటీ స్టంట్  అని, అసలైన వ్యవస్థాగత మార్పులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు. ఒక కేబినెట్ మంత్రితో కాకుండా వ్యక్తిగత అధికారంతో షో నడిపించడం, ప్రతి అంశాన్ని పిఆర్  ఈవెంట్‌గా మార్చుకోవడం ద్వారా పరిపాలనాపరమైన సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది విమర్శకుల ప్రధాన ఆరోపణ.

సామాన్యుడిని ఆకట్టుకుంటున్న కొన్ని నిర్ణయాలు

అయినప్పటికీ, విజయ్ ప్రవేశపెట్టిన కొన్ని నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సామాన్యుడిని ఆకట్టుకుంటున్నాయి. లంచగొండితనానికి వ్యతిరేకంగా నేరుగా సీఎమ్‌ఓకి ఫిర్యాదు చేసే విజిలెన్స్ నంబర్లు ఇవ్వడం, స్వయంగా తన సొంత పార్టీ నేత లంచం కేసులో దొరికితే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి జైలుకు పంపించడం వంటి చర్యలు ఆయనకు మిస్టర్ క్లీన్  ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. మంత్రులు, అధికారులు పబ్లిసిటీ కోసం విజిట్ రీల్స్ చేయడంపై నిషేధం విధించడం కూడా ఆయన నిజాయితీని తెలియజేస్తోందని మద్దతుదారులు వాదిస్తున్నారు. సినిమాల నుంచి వచ్చిన నాయకులకు ఈ రకమైన విజనరీ మాస్ ఇమేజ్ ప్రారంభంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే  సర్ప్రైజ్ విజిట్స్ అనేవి వ్యవస్థలో తాత్కాలిక భయాన్ని మాత్రమే సృష్టిస్తాయి తప్ప, శాశ్వత పాలనా సంస్కరణలను తే లేవు. 

స్థిరమైన సుదీర్ఘమైన పాలన చేయాలి

సచివాలయంలో పక్కా విధాన రూపకల్పన , ఆర్థిక స్థిరత్వం, మరియు సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయడంపై విజయ్ ఎంతవరకు దృష్టి పెడతారనే దానిపైనే ఆయన సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జాతీయ స్థాయి ప్రధాని అభ్యర్థిత్వాన్ని గురించి మాట్లాడటం విజయ్‌కి ప్రస్తుతానికి చాలా  తొందరపాటే అవుతుంది.  లోక్‌సభలో సంఖ్యాబలం, జాతీయ స్థాయిలో సిద్ధాంతపరమైన బలం లేకుండా కేవలం పాపులారిటీ ఆధారంగా ఢిల్లీ పీఠాన్ని ఆశించడం సాధ్యం కాదు. కాబట్టి, ప్రస్తుతానికి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ, తమిళనాడు బడ్జెట్, సంక్షేమం, శాంతిభద్రతల వంటి అంశాల్లో దీర్ఘకాలిక ఫలితాలను సాధించినప్పుడే విజయ్ సృష్టించిన ఈ 'ఒకే ఒక్కడు' ఇమేజ్ నిలబడుతుంది. లేని పక్షంలో ఇది కేవలం ఒక రీల్-లైఫ్ డ్రామాగా మిగిలిపోయే ప్రమాదముంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Amaravati Vision 2046: అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
CM Revanth Reddy Siddipet Meeting : గులాబీ కంచుకోటలో హస్తం దండయాత్ర: రేవంత్ సభకు ముందే హరీశ్ విమర్శల ఎటాక్ - సిద్దిపేటలో రాజకీయం రాజుకుందా?
గులాబీ కంచుకోటలో హస్తం దండయాత్ర: రేవంత్ సభకు ముందే హరీశ్ విమర్శల ఎటాక్ - సిద్దిపేటలో రాజకీయం రాజుకుందా?
Telangana Cabinet Reshuffle 2026: మూడేళ్ల పాలన వేళ కేబినెట్ ప్రక్షాళన వేడి - టీం రేవంత్‌కు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
మూడేళ్ల పాలన వేళ కేబినెట్ ప్రక్షాళన వేడి - టీం రేవంత్‌కు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget