పోస్ట్ ఆఫీస్​లో 5 లక్షలు డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడితే మీరు పెద్ద నిధిని పొందవచ్చు.

పోస్ట్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో 7.5 శాతం వడ్డీ వస్తుంది.

ఈ పథకంలో 5 లక్షలు జమ చేస్తే 5 సంవత్సరాల తర్వాత సుమారు 7,24,974 వస్తాయి.

పోస్ట్ స్కీమ్‌లో 2,24,974 వడ్డీగా గ్యారెంటీగా వస్తుంది.

పోస్ట్ ఆఫీస్ టీడీ పథకం బ్యాంకుల ఎఫ్డీ లాగే పనిచేస్తుంది.

పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఇస్తుంది.

ఈ పథకం కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉన్నందున పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.

పోస్ట్ ఆఫీసులో అందరు కస్టమర్లకు ఒకే వడ్డీ రేటు ప్రయోజనం అందుతుంది.

పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేట్ల సమాచారం తప్పకుండా తెలుసుకోండి.