ఫోన్ వేడెక్కితే చేయాల్సిన పనులివే

Published by: Geddam Vijaya Madhuri

ఫోన్లో గేమ్స్ లేదా బ్యాటరీ వినియోగం ఎక్కువగా ఉండే అప్లికేషన్లు క్లోజ్ చేసేయండి.

మీ ఫోన్ ఛార్జ్ అవుతుంటే ఛార్జర్ నుంచి తీసివేయండి.

మీ ఫోన్‌ను డైరెక్ట్ సన్ లైట్ లేదా వేడి నుంచి తొలగించి చల్లని, బాగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచండి.

మీ ఫోన్‌ను చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్‌లో ఎప్పుడూ పెట్టకూడదు.

మీ ఫోన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం వల్ల వేడి, బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది.

అవసరం లేనప్పుడు GPS, బ్లూటూత్, హాట్‌స్పాట్ ఆఫ్ చేయండి.

Published by: Geddam Vijaya Madhuri

చార్జ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ లో ఆటలు ఆడటం మానుకోండి.

మీ ఫోన్ ఎక్కువ వాడకుండానే వేడెక్కిపోతే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం తనిఖీ చేయండి.