అన్వేషించండి

AP Politics: కేడర్‌ను "సిద్ధం" చేయడమంటే ఇలాగేనా? మీరు ఇచ్చే "గ్యారంటీ" ఇదేనా? ఏం చెప్పాలనుకుంటున్నారు?

YSRCP VS TDP: ఏపీ రాజకీయాల్లో పార్టీలు హద్దు మీరి విమర్శలు చేసుకుంటున్నాయి. బూతులతోనే నేతలపై ఏహ్య భావం కలుగుతుంటే... దాన్ని పార్టీలు మరింత దిగజారే పరిస్థితికి తీసుకొచ్చాయి.

Condom Compaign In Politics : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికలు ( Assembly Elections) సమీపిస్తున్న కొద్ది...పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు, నేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు. పోటాపోటీ సభలు, ర్యాలీలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో ప్రజలకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి దాకా బూతు పురాణం రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కుటుంబసభ్యులపై అసభ్యంగా మాట్లాడుతూ...రాజకీయాలను దిగజార్చుతున్నారు. తమ ప్రత్యర్థుల పెళ్లిళ్లు, ఎఫైర్లు అంటూ వ్యక్తిగత దూషణలు చేస్తూ... తమ పార్టీ హైకమాండ్ ను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు పెళ్లాలు, ఎఫైర్లు, అంబోతులు, కుక్కలు అంటూ మాట్లాడుకున్న పార్టీలు...మరింతగా రెచ్చిపోతున్నాయి. ప్రత్యర్థులను ఎలాగైనా డ్యామేజ్ చేయాలన్న కసితో అనేక రకాల కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. 

ప్రత్యర్థులపై కండోమ్ పాలిటిక్స్
ఏపీ రాజకీయాల్లో కండోమ్‌ (Condom Compaign)లకు ప్రాధాన్యత పెరిగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కండోమ్‌లు ఎన్నికల ప్రచార సాధనంగా మారాయి. నిరోధ్ గురించి మాట్లాడుకోవడమే తప్పుకునే స్టేజ్ నుంచి నిరోధ్ లోనే ప్రచారం షురూ చేశాయి. నీచాతినీచ కామెంట్లపై పరిమితమైన పార్టీలు... ప్రత్యర్థులపై ఏకంగా కండోమ్ ప్యాకెట్లతో టార్గెట్ చేస్తున్నాయి. అగ్గి పుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు...ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి. ఏపీలో రాజకీయ పార్టీలు మరో అడుగు ముందుకేసి కండోమ్‌లు...రాజకీయ ప్రచారానికి అనర్హం కాదన్నట్లు నిరూపిస్తున్నాయ్, అధికార వైసీపీ, టీడీపీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి కండోమ్‌ ప్యాకెట్లను ప్రచారానికి వాడుకుంటున్నాయి. వాడు, వాడు బాబు, వాడమ్మ మొగుళ్ల కామెంట్లను మించేలా కండోమ్ లతో ప్రత్యర్థులపై దుర్మార్గమైన విషప్రచారం చేస్తున్నాయి. అమ్మఒడి పథకానికి పిల్లల్ని తగ్గించడానికి టీడీపీ వాళ్లు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో...ఇంటింటికీ కండోమ్స్ పంచుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేసింది. కండోమ్ ప్యాకెట్లపై తెలుగుదేశంపార్టీ సింబల్, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ స్లోగన్ ను ముద్రించారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

వైసీపీకి పోటీగా టీడీపీ సిద్ధం కండోమ్
వైసీపీ కండోమ్ ప్యాకెట్ల ప్రచారంతో తెలుగుదేశం పార్టీ శ్రేణలు అప్రమత్తమయ్యాయి. వైసీపీకి కౌంటర్ గా టీడీపీ శ్రేణులు... వైసీపీ సిద్ధం పేరుతో కండోమ్  ప్యాకెట్లు పంచుతోందంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ సిద్ధం.. సిద్ధం అని కేకలు పెట్టేది ఇందుకా ? ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా అంటూ టీడీపీ శ్రేణులు కొటేషన్లు పెడుతున్నాయి. ఇలా ప్రధాన పార్టీలు సోషల్ మీడియా వేదికగా....ఒకరిపై మరొకరు దిగజారి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది కండోమ్‌లతో ఆగిపోతుందా లేదా ప్రజలకు వయాగ్రా పంపిణీ చేయడం ప్రారంభిస్తారా ? అన్న చర్చ జరుగుతోంది. ఛీ...ఛీ.. ఏపీ రాజకీయ పార్టీలు ఇంత దిగజారిపోయారా ? మున్ముందు ఇంకెంత దిగజారుతారో అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. 

ఇలాంటి ప్రచారం ఏదో అనామక అకౌంట్ల నుంచి వేస్తే చిల్లర బ్యాచ్ ప్రచారం అనుకోవచ్చు కానీ.... ఏకంగా పార్టీ హ్యాండిల్ చేసే మెయిన్ అకౌంట్ల నుంచే ఇది జరగడంతో ఇరు పార్టీలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దిగజారుడుతనం ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో అన్న చర్చ కూడా నడుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Botsa Anusha Political Entry: రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget