News
News
X

AP Poltics Telangana CS : తెలంగాణ సీఎస్ ఎంపిక వెనుక ఏపీ రాజకీయ కోణం - కేసీఆర్ అంత దూరం ఆలోచించారా ?

తెలంగాణ కొత్త సీఎస్ ఎంపిక వెనుక ఏపీ రాజకీయ కోణం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అదేమిటంటే ?

FOLLOW US: 
Share:

AP Poltics Telangana CS :  తెలంగాణ చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి ఎన్నికయ్యారు. ఆమె పేరు చాలా అనూహ్యంగా తెరపైకి వచ్చింది.కేసీఆర్ ఆలోచనలు ఏమిటన్నది చాలా మందికి అర్థం కాలేదు. కానీ శాంతి కుమారి ఎంపిక వెనుక ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయాలన్న ఆలోచన ఉందన్న  అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే రెండు రోజులుగా పరిణామాలు చోటు చోటు చేసుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు శాంతి కుమారి ఎంపికకు.. ఏపీ రాజకీయాలుక సంబంధం ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారింది. 

మచిలీపట్నం, కాపు సామాజికవర్గం - శాంతి కుమారికి కలిసొచ్చిన అంశాలా ?

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఏపీలోని మచిలీపట్నానికి చెందిన వారు. ఆమె కాపు సామాజికవర్గమని తెలుస్తోంది.  ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వంలో పెద్దగా కీలక బాధ్యతల్లో ఉన్నట్లుగా కనిపించని శాంతికుమారి అనే సీనియర్ ఐఏఎస్ అఫీసర్ సీఎస్ అయిపోయారు. అసలు ఆమెను ఎంపిక చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆర్థిక శాఖ చూస్తున్న రామకృష్ణారావు కేసీఆర్‌కు చాలా దగ్గర. ఆయనే సీఎస్ అవుతారనుకున్నారు. కానీ కేసీఆర్ శాంతి కుమారిని ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఏపీ కాపు నేతలు ప్రగతి భవన్ లో కలిశారు. వారితో పాటు చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆ ఫోటో కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కూడా కేసీఆర్ ను కలిశారు. వీరిద్దరూ ఐఏఎస్ బాధ్యతల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవలి వరకూ వీరిద్దరూ జనసేనలోనే ఉన్నారు. 

కేసీఆర్ ను కలిసిన సమయంలో శాంతి కుమారి కూడా ఉన్నారు ! 
 
శాంతి కుమారితో పాటు వీరు కూడా కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లడానికి కారణం... కాపు కోణమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఏపీలో కాపు సామాజికవర్గంపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఈ కోణంలోనే ఆమెను సీఎస్ గా ఎంపిక చేశారని చెబుతున్నారు. అందుకే ఆ వెంటనే ఏపీ కాపు బీఆర్ఎస్ నేతల్ని ప్రగతి భవన్‌కు ఆహ్వానించారంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంక్ ఉండాలంటే.. ప్రధాన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారంటున్నారు. ఈ కారణంగా కాపు సామాజికవర్గంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారని అంటున్నారు. ఈ కోణంలోనే రాజకీయం కూడా జరుగుతోందని అంటున్నారు. 

అనూహ్యంగా శాంతి కుమారిని అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ !  

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారికి టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. శాంతికుమారి చిత్తశుద్ధి తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణకు తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి నియామకం కావడం సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ నియామకాల గురించి చిరంజీవి ట్వీట్ చేయరు. ఈ ట్వీట్ వెనుక కూడా రాజకీయం ఉందని భావిస్తున్నారు. 

ఉన్నతాధికారుల నియామకాల్లోనూ ఇక సామాజిక కోణమే కీలకంకనుందా ? 

ఇలాంటి సమీకరణాల వల్ల ఎంత లాభం వస్తుందో కానీ.. అధికారవర్గాల్లో మాత్రం గతంలో మంత్రి పదవులు మాత్రమే సామాజిక సమీకరణాలు చూసేవారని..ఇప్పుడు అధికారుల్లోనూ చూస్తారన్న చర్చ జరుగుతోంది. శాంతి కుమారిని కేవలం సామాజిక కోణంలోనే ఎంపిక చేసి ఉంటే మాత్రం...  రాజకీయం కొత్త పుంతలు తొక్కుతున్నట్లేనని రాజకీయవర్గాలు గట్టి నిర్ణయానికి వచ్చేస్తాయనడంలో సందేహం లేదు. 

Published at : 13 Jan 2023 06:08 AM (IST) Tags: IAS Shanti Kumari new CS of Telangana KCR target on AP politics BRS target on Kapu faction

సంబంధిత కథనాలు

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?

TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!