Revanth Reddy Attack on KCR:డైవర్షన్ పొలిటిక్స్ వర్సెస్ తెలంగాణ మోడల్ సెంటిమెంట్ - రేవంత్ ఆటను కేసీఆర్ ఎదుర్కొనే ప్లాన్ ఇదే!
KCR Resignation Demand Congress Protests: కేసీఆర్ రాజీనామాకు డిమాండ్ చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏమీ చేయకుండా ప్రజాధనం తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు.

BRS Counter Strategy Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేయని ప్రతిపక్ష నేత కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఊరూవాడ నిరనసలు చేపట్టాలని కూడా పిలుపునిచ్చారు. వ్యూహాత్మకంగా విసిరిన కేసీఆర్ రాజీనామా బాణాన్ని తట్టుకోవడం బీఆర్‌ఎస్‌కు తాత్కాలికంగా ఇబ్బందికర అంశమే అయినప్పటికీ, కేసీఆర్ మార్కు మైండ్ గేమ్‌లో ఇది కొత్తేమీ కాదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారనే దాడిని రేవంత్ తీవ్రతరం చేయడాన్ని బీఆర్‌ఎస్ అధినాయకత్వం ఒక డైవర్షన్ ప్లాన్ గానే అభివర్ణిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన 1,000 రోజుల పాలనా కాలంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతుబంధు, రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ రీజూవినేషన్ వివాదాల నుండి ప్రజా దృష్టిని మళ్లించడానికే రేవంత్ ఈ వ్యక్తిగత విమర్శల ఎత్తుగడను ఎంచుకున్నారని హరీష్ రావు వంటి సీనియర్ నేతలు వెంటనే గళమెత్తారు. రేవంత్ సృష్టిస్తున్న ఈ నెగెటివ్ నారేటివ్‌ను బ్రేక్ చేయడానికి కేసీఆర్ ఇప్పటికే అంతర్గతంగా ఐదు అంచెల ప్రతివ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు.
కేసీఆర్‌ను రేవంత్ అవమానిస్తున్నారా?
కేసీఆర్ అమలు చేయబోయే మొదటి ప్రతివ్యూహం తెలంగాణ ఆత్మగౌరవ కార్డు . తాను కేవలం ఒక రాజకీయ నాయకుడిని మాత్రమే కాదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పితామహుడిననే భావన ప్రజల్లో ఇప్పటికీ ఉంది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన నన్ను, కేవలం కొన్ని రోజుల సభలకు హాజరు కాలేదన్న సాకుతో రేవంత్ అవమానిస్తున్నారు అనే సెంటిమెంట్‌ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా, రేవంత్ చేస్తున్న విమర్శలను తెలంగాణ సాధకుడిపై జరుగుతున్న దాడి గా మలచడం కేసీఆర్ మొదటి ఎత్తుగడ.
త్వరలోనే కేసీఆర్ రీ ఎంట్రీ
రెండవది, ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే రేవంత్ వేసిన పదవుల కోసం బయటకు వస్తున్నారు అనే ముద్ర వేస్తారు. దీన్ని చెరిపేసేందుకు సమయానుకూల రీ-ఎంట్రీ వ్యూహం బీఆర్ఎస్ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. రేవంత్ సవాలు చేశారని లేదా కాంగ్రెస్ ధర్నాలు చేస్తోందని వెంటనే రోడ్డుపైకి వస్తే, అది రేవంత్ గెలుపు కిందకే వస్తుంది. అందుకే ఈ నిరసనల వేడి చల్లారాక, సరైన రాజకీయ వాతావరణం చూసుకుని భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాను బయటకు వస్తే అది సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, కాంగ్రెస్ పాలనలో నష్టపోతున్న రైతులు, చేతివృత్తుల వారు, నిరుద్యోగుల సంక్షేమం కోసమేనని నిరూపించేలా కేసీఆర్ పర్యటనల రూట్ మ్యాప్ ఉండబోతోంది.
సరైన సమయం కోసం కేసీఆర్ ఎదురు చూపులు
అసెంబ్లీ డిబేట్‌ను ఆయుధంగా మార్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ గట్టి షాక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. సెప్టెంబరులో జరగనున్న శాసనసభ సమావేశాలకు హాజరై, కాంగ్రెస్ ఎదుర్కొంటున్న వైఫల్యాలను, అమలు కాని హామీలను నేరుగా సభలోనే ఎండగట్టడం. రేవంత్ విసిరిన 1000 రోజుల పాలన సవాలును స్వీకరించి, సభ సాక్షిగా గణాంకాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, రేవంత్ సృష్టించిన పనిచేయని నాయకుడు అనే ముద్ర ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతుందనేది కేసీఆర్ నమ్మకం. రేవంత్ రెడ్డి విసురుతున్న వ్యక్తిగత విమర్శలకు నేరుగా కేసీఆర్ సమాధానం ఇవ్వకుండా, కేటీఆర్, హరీష్ రావులను రేవంత్‌పైకి దాడికి దింపడం. ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహాన్ని ప్రతిబింబించేలా రోడ్ల మీదకు కేడర్‌ను తరలించడం ద్వారా కాంగ్రెస్ చేస్తున్న కేసీఆర్ రాజీనామా ఆందోళనలను కౌంటర్ చేయడం ఇప్పటికే ప్రారంభమైంది.
రేవంత్ రెడ్డి ఆడుతున్నది దూకుడుతో కూడిన పొలిటికల్ అఫెన్సివ్ గేమ్ అయితే, కేసీఆర్ అనుసరిస్తున్నది ఆయనమార్క్ స్ట్రాటజిక్ సైలెన్స్ వ్యూహం. కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకత పరాకాష్టకు చేరే వరకు వేచి చూసి, సరైన సమయంలో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి వేసిన ముద్రను తిప్పికొట్టడమే కేసీఆర్ ముందున్న అసలైన సవాలు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















