అన్వేషించండి

Telangana Municipal Elections 2026 : తెలంగాణ మున్సిపల్ పోరులో గల్లీ సమస్యలు మాయం.. ఢిల్లీ స్థాయి రాజకీయం!

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్యిలో లోకల్ మస్యలు మరుగునపడి, రాజకీయ విమర్శలే అజెండాగా మారాయి. కేటీఆర్ రేవంత్ ట్రాప్‌లో పడవద్దని చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. అయితే  ఓటర్ల కనీస అవసరాలైన డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి స్థానిక అంశాల కంటే రాష్ట్రస్థాయి రాజకీయ విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలంటేనే స్థానిక సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరు. కానీ, ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే, ఇది కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య పైచేయి సాధించే  రాజకీయ కుస్తీ గా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. . ముఖ్యంగా అజెండా సెట్ చేయడంలో అధికార కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకెళ్తుంటే, ప్రతిపక్షాలు ఆ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

బహిరంగసభల్లో రాజకీయమే మాట్లాడుతున్న రేవంత్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో స్థానిక మున్సిపల్ సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ అంశాలనే హైలెట్ చేస్తున్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య బంధం, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోకి మళ్లించడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. నిజామాబాద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దీనివల్ల ఓటరు దృష్టి స్థానిక కౌన్సిలర్ పనితీరు కంటే రాష్ట్రస్థాయి రాజకీయాల వైపు మళ్లుతోంది.

ఇప్పటికే ట్రాప్‌లో పడిపోయిన విపక్షాలు

ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ సెట్ చేసే రాజకీయ ట్రాప్‌లో పడొద్దని, ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు స్థానిక సమస్యలను, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపాలని కోరారు.  కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి చేసే రాజకీయ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్థానిక అంశాలను హైలెట్ చేయడంలో విపక్షాలు విఫలమవుతున్నాయని, తద్వారా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా విసిరిన వలలో వారు చిక్కుకున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రధాన ప్రతిపక్షాలు అయిన బీఆర్ఎస్, బీజేపీ స్థానిక సమస్యలు, మున్సిపాలిటీల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను చర్చలోకి తీసుకురావడంలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయి. కేవలం ముఖ్యమంత్రిని విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఓటర్లు కూడా స్థానిక అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, పనితీరును గమనించడం మానేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను  ఓట్ల రూపంలోకి మార్చుకోవాలంటే ఉండాల్సిన  గ్రౌండ్ లెవల్ అజెండా  ప్రతిపక్షాల వద్ద కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల ఓటింగ్ ప్రయారిటీ ఏమిటి? 

మున్సిపల్ ఎన్నికల ద్వారా తమ గల్లీలోని సమస్యలు తీరతాయని ఆశించిన ప్రజలకు, నేతల మధ్య సాగుతున్న రాజకీయమే కనిపిస్తోంది.  ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోకుండా ఇదే రాజకీయ ట్రాప్‌లో కొనసాగితే, అది అధికార పార్టీకి మరింత అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్థానిక అవసరాల కంటే, రాజకీయ బలబలాలను నిరూపించుకునే రిఫరెండంలా మారబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోపు విపక్షాలు కేటీఆర్ చెప్పినట్లుగా స్థానిక అజెండాను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలవు అనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలను అధిగమించి, ప్రజల కష్టాలను చర్చలోకి తీసుకువస్తేనే విపక్షాలకు మైలేజీ లభిస్తుంది. లేదంటే ఈ ఎన్నికలు కేవలం రాజకీయ రంగు పులుముకున్న వార్  లాగే మిగిలిపోతాయని అనుకోవచ్చు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget