అన్వేషించండి

Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?

Revanth Reddy Cabinet Reshuffle: తెలంగాణ కేబినెట్ మార్పు చేర్పులకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఈ కసరత్తు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

Telangana New Ministers List:   తెలంగాణలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టానికి తెరలేపుతోంది. మంత్రివర్గంలో మార్పుచేర్పులు ,ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి తుది అనుమతి లభించినట్లు తెలుస్తోంది.   అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియగానే  ఈ విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ పరిణామం కేవలం పదవుల పెంపకానికే పరిమితం కాకుండా, పార్టీపై , పాలనపై సీఎం తన పట్టును మరింత బిగించే ప్రక్రియగా కనిపిస్తోంది.

ప్రస్తుతం  కేబినెట్‌లో మూడు ఖాళీలు

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో సాంకేతికంగా ఖాళీలు ఏర్పడగా, కొండా సురేఖ బర్తరఫ్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రాతినిధ్యంతో పాటు బీసీ మహిళా స్థానం ఖాళీ అయింది. అంటే ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయి.  దీంతో పాటు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాతినిధ్యాన్ని కల్పించడం  సీఎం రేవంత్ ముందున్న ప్రధాన లక్ష్యం. మూడేసి ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, పనితీరు సరిగ్గా లేని కొంతమంది మంత్రుల శాఖలను మార్చడం లేదా వారి స్థానంలో నూతన ముఖాలకు అవకాశం కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రణాళిక సిద్ధమైంది.

బీసీ మహిళలకు పదవులు  - మంత్రి పదవి కూడా  

కొండా సురేఖను తప్పించిన వెంటనే, నష్ట నివారణ చర్యల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కీలక బీసీ మహిళా నేతలకు ఉన్నతమైన నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం ద్వారా తన సామాజిక వ్యూహాన్ని చాటుకున్నారు. కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి  , మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద  , కుడా ఛైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి లను నియమించడం ద్వారా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశామనే సంకేతాన్ని పంపించారు. ఇదే సూత్రాన్ని రాబోయే కేబినెట్ భర్తీలోనూ పాటిస్తూ ఒక బీసీ మహిళకు మంత్రిపీఠం దక్కేలా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు.

సరిగ్గా పని చేయని వారికి ఉద్వాసన

మరోవైపు, పాత కాంగ్రెస్ నేతలు ,  కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మధ్య సమన్వయం పాటించడం ఈ కేబినెట్ విస్తరణలో రేవంత్ రెడ్డికి ఎదురుకానున్న పెద్ద పరీక్ష. పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడిన సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అధిష్టానంతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగిస్తూ దిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. అయితే, మంత్రివర్గంలో కేవలం రాజకీయ సమీకరణాలే కాకుండా, రాబోయే స్థానిక సంస్థలు మరియు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడే డైనమిక్ నాయకులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణ ద్వారా రేవంత్ రెడ్డి కేవలం ఖాళీలను పూరించడమే కాకుండా, పనితీరు సరిగ్గా లేని మంత్రులకు హెచ్చరిక పంపేలా  పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రక్షాళన చేయనున్నారు. 

నామినేటెడ్ పదవులు కూడా ఒకే సారి భర్తీ  

ఐటీ, రెవెన్యూ, నీటిపారుదల వంటి కీలక శాఖలు తప్ప మిగిలిన శాఖల్లో పనితీరును సమీక్షించి, సమర్థులైన అధికారులకు మరియు మంత్రులకు తగిన రీతిలో పోర్ట్‌ఫోలియోలను పునర్విభజించే అవకాశం ఉంది. ఈ దిశగా ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా పూర్తవ్వడం పాలనాపరమైన మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.రాబోయే కేబినెట్ విస్తరణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక రకమైన  పొలిటికల్ రీసెట్ కాబోతోంది. అంతర్గత అసమ్మతికి తావులేకుండా, సామాజిక న్యాయాన్ని కాపాడుతూ, నామినేటెడ్ పదవులు ,  కేబినెట్ బెర్త్‌లను ఒకేసారి భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై మరియు కాంగ్రెస్ క్యాడర్‌పై తన అజమాయిషీని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకోనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
Kalvakuntla Kavitha : తెలంగాణ రక్షణ సేన తొలి శంఖారావం - ఎమ్మెల్సీ బరిలో కవిత పార్టీ.. బిఆర్ఎస్‌ను దాటేస్తారా?
తెలంగాణ రక్షణ సేన తొలి శంఖారావం - ఎమ్మెల్సీ బరిలో కవిత పార్టీ.. బిఆర్ఎస్‌ను దాటేస్తారా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Embed widget