Bandi Sanjay On KCR : కేసీఆర్ పాలనలో శ్రీలంకలా తెలంగాణ - గోల్కొండ కోటపై కాషాయ జెండా ఖాయమన్న బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణను శ్రీలంకలా చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తుక్కుగూడులో నిర్వహించిన ప్రజా సంక్షేమ యాత్ర రెండో విడత ముగింపు సభలో బండి సంజయ్ కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఒకే కుటుంబం పాలించిన శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో చూడండి. కీలక శాఖలన్నీ కల్వకుటుంబం కుటుంబం చేతుల్లోనే ఉంది. కేసీఆర్ పాలన పోకపోతే మనకూ శ్రీలంక పరిస్థితే దాపురిస్తుంది. తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం కోసమే ప్రజా సంగ్రామ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచే ప్రసక్తే లేదు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.
ప్రజాసంగ్రామ యాత్రలో TRS వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమన్నారు. చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా సమస్యలే ఉన్నాయని ఆరోపించారు. పాదయాత్రలో స్వయంగా అనేక సమస్యలు చూశానన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందన్ారు. పంచభూతాలను సైతం వదలడం లేదు. హామీలను నెరవేర్చకుండా మోసంచేస్తోంది ఈ ప్రభుత్వని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒకసారి వరి వద్దంటారు.. మరోసారి పత్తి వద్దంటారు. తుగ్లక్ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగాన్ని సీఎం ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీఎస్‌ను పూర్తిచేసే బాధ్యత మాదే. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్ అలా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
ప్రజాసంగ్రామ యాత్రలో తనకు 18వేల అర్జీలు వస్తే.. అందులో 60 శాతం ఇళ్లులేని పేదోళ్లవే. మోదీ ఆలోచన మేరకు పేదవాళ్ల కోరికలు నెరవేరాలంటే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడాలి. అధికారంలోకి వస్తే నిలువ నీడలేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మిస్తాం. నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలో వ్యాట్ సవరించి పెట్రోల్, డీజిల్ రేటు తగ్గిస్తాం. ఫసల్ బీమా యోజనతో రైతాంగాన్ని ఆదుకుంటాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలను కచ్చితంగా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.
నిజాం సమాధి ముందు మోకరిల్లే సీఎం మనకెందుకని బండి సంజయ్ సభికులను ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు బీజేపీ నేతలు శ్రమించారు. ఆ ప్రకారం పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. బండి సంజయ్ ప్రసంగం కూడా సభికులను విశేషంగా ఆకట్టుకుంది., దూకుడుగా కేసీఆర్ విమర్శలు చేస్తూ పాదయాత్ర చేసిన ఆయన.. ముగింపు సభలోనూ ఆ టెంపో చూపించారు. బండి సంజయ్ ప్రసంగాన్ని అమిత్ షా కూడా ఆసక్తిగా ఆలకించారు.