Tdp Chargesheet: జగన్ నెరవేర్చని హామీలపై తెలుగుదేశం ఛార్జిషీట్- ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామన్న చంద్రబాబు
Tdp Chargesheet జగన్ నెరవేర్చని హామీలపై తెలుగుదేశం ఛార్జిషీట్- ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామన్న చంద్రబాబు
మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో ..99శాతం అమలు చేశామని ఏపీ సీఎం జగన్(Jagan) పదేపదే వల్లెవేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే మాట చెబుతున్నారు. మరి ఊరూరా తిరుగుతూ, ఇంటింటికి వెళ్లి ముద్దులుపెట్టి ఇచ్చిన 720 హామీల సంగతి ఏంటని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం( Tdp) ప్రశ్నిస్తోంది. వీటిలో 620కు పైగా హామీలు అసలు టచ్ చేయలేదని చంద్రబాబు(Cbn) విమర్శించారు. సీఎం జగన్ చెబుతున్న 99శాతం హామీలు బెద్ద బూటకమని మండిపడ్డారు
ప్రజాకోర్టులోనే తేల్చుకుందాం
జగన్ రెడ్డి ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ ప్రజాకోర్టు’ పేరుతో తెలుగుదేశం( Tdp) ఛార్జ్ షీట్ విడుదల చేసింది. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయమంది. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఫెయిల్యూరుగా జగన్ నిలిచిపోతారన్న చంద్రబాబు.(Cbn)...మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా వైకాపా ప్రభుత్వాన్ని శిక్షిస్తారన్నారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్( Jagan) నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశాడని దుయ్యబట్టారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ(Tdlp) ఛార్జి షీట్’ను విడుదల చేసింది. పాదయాత్రలో జగన్ మొత్తం 730 హామీలు ఇచ్చారని వాటిల్లో 20శాతం కూడా అమలు చేయలేదని తెలుగుదేశం లెక్కలతో సహా వెల్లడించింది. కానీ జగన్ 99 శాతం హామీలు అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండానే 99శాతం హామీలు అమలు చేసినట్లు ప్రజలను మభ్యపెడితే తెలుగుదేశం పార్టీచూస్తూ ఊరుకోబోదని...ప్రజలకు జగన్ చేస్తున్న మోసాన్ని వివరించి వారిలో చైత్యనం తీసుకొస్తామని హెచ్చరించారు.గత ఎన్నికల్లో ఒక్కఛాన్స్ పేరిట జనాలను మోసం చేశాడని...మళ్లీ మోసపోతేఈసారి రాష్ట్రం అంధకారమవుతుందని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ మాయలో పడొద్దని హితవు పలికారు
ప్రత్యేక హోదా ఏదీ..
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా పెద్దపెద్ద యువ సభలు పెట్టి ఊదరగొట్టిన జగన్...అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ ఊసే ఎత్తలేదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలపై రూ.64వేల కోట్ల భారం మోపారన్నారు. మద్య నిషేదం చేస్తామని ఊరూరా తిరిగి చెప్పిన జగన్...అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు చేపట్టారని తెలుగుదేశం(Tdp) దుయ్యబట్టింది. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని అటెకెక్కించారని చంద్రబాబు(Cbn) మండిపడ్డారు. సీపీఎస్ రద్దు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం..పోలీసులకు వీక్లీఆఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ఇచ్చిన హామీల లిస్టు చేంతాడంట ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఇవిగాక పాదయాత్రలో కనిపించిన చోటల్లా ఇష్టానుసారం హామీలిచ్చారని గుర్తుచేశారు. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామని, అంగన్వాడీల జీతాలు పెంచుతామని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని నోటికొచ్చినట్లు హామీలిచ్చారని తెలుగుదేశం ఛార్జిషీట్‌లో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు విస్మరించడమేగాక...అడిగిన వారిపై కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.