అన్వేషించండి

Telangana BRS Politics: జగిత్యాల జంగ్ - జీవన్ రెడ్డి గులాబీ గూటికి.. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో చిచ్చు తప్పదా?

BRS Politics: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఖాయమయింది. అయితే ఇది బీఆర్ఎస్‌కు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా?

Jeevan Reddy is set to board BRS:   కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ, కష్టకాలంలోనూ పార్టీ జెండా మోసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ లో చేర్చుకోవడం.. మున్సిపల్ ఎన్నికల ముందే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురిచేసింది.  గెలిచిన నేతలను చేర్చుకుంటూ ఓడిన మమ్మల్ని అవమానిస్తారా  అంటూ ఆయన  పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సెక్రటరీ జనరల్ పదవి.. సీనియర్ల గుసగుసలు                   

బీఆర్ఎస్ అధిష్టానం జీవన్ రెడ్డికి కేకే వదిలిపెట్టిన సెక్రటరీ జనరల్  వంటి కీలక పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పదవిని, కొత్తగా వచ్చిన వ్యక్తికి కట్టబెట్టడంపై మొదటి నుండి కారు పార్టీని నమ్ముకున్న సీనియర్లలో అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది.  ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకున్న ఇతర ఉమ్మడి కరీంనగర్ నేతలను పక్కనపెట్టి, నిన్నటిదాకా తమను తిట్టిన నేతకు రెడ్ కార్పెట్  వేయడం ఏమిటని కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో నాయకత్వ పోరు                      

జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాయకత్వ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటికే జిల్లాలో గంగుల కమలాకర్ వంటి బలమైన నేతలు ఉండగా, ఇప్పుడు జీవన్ రెడ్డి వంటి దిగ్గజం చేరడం  ఆధిపత్య పోరు కు దారితీయవచ్చు. ముఖ్యంగా జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఎవరి కింద పనిచేయాలన్న గందరగోళంలో ఉన్నాయి. నిన్నటిదాకా కొట్టుకున్న వర్గాలు ఇప్పుడు ఒకే జెండా కింద ఎలా కలిసి సాగుతాయన్నది పెద్ద ప్రశ్న. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ బీఆర్ఎస్‌కు బలంగా మారవచ్చు కానీ, అది పాత క్యాడర్‌లో చీలిక తెచ్చే ప్రమాదం ఉంది. సంజయ్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తుండటంతో, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది.  

ఇటీవలి కాలంలో గెలవని జీవన్ రెడ్డి                            

ఎన్నో అవకాశాలు వచ్చినా గెలవని జీవన్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల పార్టీకి లాభమా లేక నష్టమా అనే చర్చ బీఆర్ఎస్‌లో జరుగుతున్నా, ఆయన అనుభవం పార్టీకి అవసరమని అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. అయితే, ఈ నిర్ణయం కరీంనగర్ గులాబీ తోటలో ముళ్లు జల్లినట్టే అవుతుందన్నది విశ్లేషకుల అంచనా.  జీవన్ రెడ్డికి అంత ప్రజాబలం లేదని..  అయనకు బదలుగా యువనేతల్ని ప్రోత్సహిస్తే మంచిదని.. గతంలో కేకేను ప్రోత్సహిస్తే ఏం జరిగిందో తెలుసుకదా అని క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget