అన్వేషించండి

Viral News: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..

Jupally Krishna Rao | తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నాడు హైదరాబాద్‌లో సామాన్యుడిలా సాదాసీదాగా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Minister Jupally In Metro Rail | హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నగరంలో సాదాసీదాగా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా మంత్రులకు ఉండే భారీ భద్రత, కాన్వాయ్ ప్రోటోకాల్స్‌ను పక్కన పెట్టి, ఆయన ఒక సామాన్య ప్రయాణికుడిలా మెట్రో ఎక్కారు. నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా, ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుని సకాలంలో చేరుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.


Viral News: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..

ట్రాఫిక్ కష్టాలు తప్పించుకునేందుకు మెట్రో ఎక్కిన మంత్రి

మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు నేరుగా ఎర్రమంజిల్ స్టేషన్‌కు చేరుకుని, క్యూలో నిల్చుని టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్‌ఫాంపైకి వెళ్లి సామాన్యులతో కలిసి రైలు ఎక్కారు. ఆ సమయంలో రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన ప్రత్యేకంగా సీటు కోసం ప్రయత్నించలేదు. మియాపూర్ వరకు సుమారు 30 నిమిషాల పాటు తోటి ప్రయాణికులతో కలిసే నిల్చుని ప్రయాణించారు. ఈ క్రమంలో ప్రయాణికులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, మెట్రోలోని సౌకర్యాలు, ప్రయాణ అనుభవాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.


Viral News: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..

తమ మధ్యలో మంత్రి జూపల్లి కృష్ణారావును చూసిన ప్రయాణికులు మొదట ఆశ్చర్యానికి గురైనప్పటికీ, ఆయన సాదాసీదా ప్రవర్తనను చూసి హర్షం వ్యక్తం చేశారు. యువత, ఇతర ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి చిరునవ్వుతో వారందరికీ సహకరించారు. పని ఉండటంతో అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయారు. నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, సమయాన్ని ఆదా చేస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో రైలు అత్యుత్తమ మార్గమని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget