అన్వేషించండి

Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?

CM Revanth: ఆరు గ్యారంటీల అమలు విషయంలో సీఎం రేవంత్ స్పందన భిన్నంగా ఉంది. అమలు చేయడానికి సమయం పడుతుందని ఆయన చెబుతున్నారు. అయితే ఇప్పటికే రెండున్నరేల్లు దగ్గర పడుతోంది.

Congress guarantees are not guaranteed: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర ఏళ్లు గడుస్తున్న తరుణంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు,  ఇతర ప్రధాన హామీల అమలు తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో  పెళ్లైన మూడు నెలలకే బిడ్డ పుడతారా అంటూ హామీల అమలుకు సమయం కావాలని కోరుతున్నప్పటికీ, సామాన్య ప్రజానీకం మాత్రం ఫలితాల కోసం వేచి చూస్తోంది.  

అమలులోకి వచ్చిన పాక్షిక హామీలు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం , ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు,  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలులోకి తెచ్చింది. ఇవి క్షేత్రస్థాయిలో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాయి. అలాగే, గ్యాస్ సిలిండర్లను రూ. 500 కే అందించే పథకం కూడా లబ్ధిదారులకు అందుతోంది. అయితే, ఇవి కేవలం ఆరు గ్యారంటీలలోని ఒక భాగం మాత్రమే. 

అపరిష్కృతంగా ఉన్న ప్రధాన హామీలు

అత్యంత కీలకమైన  మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 నగదు బదిలీ హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనిపై కోట్లాది మంది మహిళలు ఆశలు పెట్టుకున్నారు. అలాగే, రైతులకు ఇస్తామన్న రూ. 15,000 రైతు భరోసా  పంపిణీలో కూడా జాప్యం జరుగుతోంది. పాత బకాయిలు తీర్చడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో, కొత్తగా పెంచిన మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారనే దానిపై స్పష్టత కరువైంది. యువతకు ఇస్తామన్న యువ వికాసం కార్డులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అతి పెద్ద సవాల్ పెన్షన్ల పెంపు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు సహా అనేక వర్గాలకు ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతామని రేవంత్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.కానీ ఇప్పటి వరూక అమలు కాలేదు. 
 
ఆర్థిక ఇబ్బందులు - రేవంత్ రెడ్డి సమర్థన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచుగా గత ప్రభుత్వం వదిలి వెళ్లిన  7 లక్షల కోట్ల అప్పుల గురించి ప్రస్తావిస్తూ, ఖజానా ఖాళీగా ఉండటం వల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని వివరిస్తున్నారు. ఈ  వ్యాఖ్యలు రాజకీయంగా తనను తాను సమర్థించుకోవడానికి ఉపయోగపడవచ్చు కానీ, ప్రజల్లో ఉన్న అసహనాన్ని తగ్గించలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం కోసం ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సి రావడం లేదా ఇతర అభివృద్ధి పనులకు నిధులు కోత విధించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఆరు నెలల నుండి ఏడాది లోపు కనీస మార్పును ఆశిస్తారు. రెండున్నర ఏళ్లు దాటినా కీలక హామీలు అందకపోవడం వల్ల ప్రజల్లో నెమ్మదిగా వ్యతిరేకత  మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి , గ్రామీణ ఓటర్లు కేవలం వివరణల కంటే, తమ ఖాతాల్లోకి వచ్చే నగదు లేదా తమ బతుకుల్లో వచ్చే మార్పునే గమనిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వాక్చాతుర్యంతో ఎంతకాలం నెట్టుకొస్తుందో కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి హామీల అమలులో పురోగతి చూపకపోతే అది పార్టీకి నష్టం చేకూర్చవచ్చు.

మాటలు కాదు.. చేతలు కావాలి

ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన పత్రం. దానిని కేవలం ఓట్లు దండుకోవడానికి ఉపయోగించే  కాగితం గా కాకుండా, ప్రజలతో చేసుకున్న ఒప్పందంగా భావించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరణలను పక్కన పెట్టి, ఆర్థిక వనరులను సమకూర్చుకుని మిగిలిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో,  మరో అవకాశం ఇస్తాం అని చెప్పే లోపే ప్రజల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Chirala AP Municipal Election Results : చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Embed widget