అన్వేషించండి

CM Revanth Reddy: పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams Pinarayi Vijayan: ప్రధాని మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, ఢిల్లీ నుంచి గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్‌కు ప్రధాని మోదీకి మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఢిల్లీ నుంచి గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేరళ సీఎం పినరయి విజయన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయన్ తనకు రాసిన లేఖలో 2014-23 మధ్య కాలంలోని అంశాలను ప్రస్తావించారని, ఆ సమయంలో ఆయన సన్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన పొరపాట్ల వల్లే తెలంగాణ ప్రజలు ఆయన్ను గద్దె దించారని, ఇప్పుడు కేరళ ప్రజలు కూడా విజయన్‌ను మార్చడం ఖాయమని జోస్యం చెప్పారు.

పినరయి విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు..
పినరయి విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, గోల్డ్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన జోలికి వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విజయన్‌కు గాడ్‌ఫాదర్‌లా ఢిల్లీలో మోదీ ఉన్నారని, అందుకే ఆయన ఈ కేసుల నుండి తప్పించుకుంటున్నారని విమర్శించారు. దేశం కోసం ఆస్తులను, జీవితాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని కేసులతో వేధిస్తున్న కేంద్రం, కేజ్రీవాల్ వంటి నేతలను అరెస్ట్ చేసిన ఈడీ.. విజయన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, విజయన్ మధ్య ఉన్న అవగాహన, చీకటి ఒప్పందాల వల్లే కేరళ సీఎంపై ఎలాంటి అరెస్టులు, విచారణలు జరగడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ రహస్య బంధాన్ని కేరళ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని, ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తరహాలోనే కేరళలో కూడా త్వరలో మార్పు వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పినరయి విజయన్‌తో చర్చకు రెడీ..

‘పినరయి విజయన్ ఎప్పుడు సిద్ధంగా ఉన్నా, నేను ఆయనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను... ఆయన రోల్ మోడల్స్ ఎవరు. నరేంద్ర మోదీ, అమిత్ షా నా, లేక జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీలను ఫాలో అవుతున్నారా చర్చిద్దాం. పినరయి విజయన్ నరేంద్ర మోదీని తన రోల్ మోడల్‌గా భావిస్తున్నారు. ఇది కేరళ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మరొక నరేంద్ర మోదీలా పినరయి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని’ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
PM Matru Vandana Yojana: మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
Hyderabad Crime News:పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
Viral News: హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Strait of Hormuz:
"హర్మూజ్‌ జలసంధి మూసివేస్తాం" శాంతి చర్చలకు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ వార్నింగ్! ట్రంప్ తీరుపై ఆగ్రహం!
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్! ఈ రైతులకు నిరాశే!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్! ఈ రైతులకు నిరాశే!
Womens vote bank politics: మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
Ashwagandha Leaves Banned: అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
Vishnu Manchu: గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
Krithi Shetty: సినిమా ఫ్లాపే కానీ కృతి శెట్టి గ్లామర్ హిట్టు
సినిమా ఫ్లాపే కానీ కృతి శెట్టి గ్లామర్ హిట్టు
Embed widget