అన్వేషించండి

Test For TVK Vijay: విజయ్‌కు ముళ్ల కిరీటమే - రాజకీయంగా ఎన్నో సవాళ్లు - తట్టుకోలేకపోతే గండమే!

Tvk Vijay: మైనార్టీ ప్రభుత్వాన్ని నడపడం విజయ్‌కు అంత ఈజీ కాదు. ఓ రకంగా ఆయనకు లభించింది ముళ్ల కిరీటమే.

minority government not easy for Vijay : తమిళనాడులో విజయ్ పార్టీ సంపూర్ణంగా విజయం సాధించలేదు. ఆయన టూ బై ధర్డ్ తరహా మెజార్టీ వస్తే తిరుగులేదని అనుకోవచ్చు. కానీ మెజార్టీకి ఇతరుల మీద ఆధారపడాల్సిందే. అంటే మైనార్టీ సర్కార్ ను నడపాలి. ప్రజలు ఇతర పార్టీల కన్నా ఎక్కువగా చాన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. అయితే  అది ముళ్ల కిరీటం లాంటి దే.  ఆయనకు ప్రజలు అతిపెద్ద పార్టీగా గౌరవం ఇచ్చారు కానీ, సంపూర్ణ అధికారాన్ని  కట్టబెట్టలేదు. రాబోయే ఐదేళ్ల కాలం విజయ్‌కు ఒక నిరంతర అగ్నిపరీక్షగా మారనుంది.  

 మైనార్టీ ప్రభుత్వ వైకుంఠపాళి 

మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు కొద్ది దూరంలో టీవీకే  ఆగిపోవడంతో, విజయ్ ఇప్పుడు ఒక  మైనార్టీ  ప్రభుత్వం నడపక తప్పని పరిస్థితి. స్వతంత్రులు లేదా చిన్న పార్టీల మద్దతుతో ఆయన ప్రమాణ స్వీకారం చేసినా, ప్రతి బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవడం ఆయనకు కత్తిమీద సామే అవుతుంది. ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రస్తుతానికి ప్రజా తీర్పును గౌరవిస్తూ మౌనంగా ఉన్నట్లు కనిపించినా, అది  తుపాను ముందు ప్రశాంతత  మాత్రమే అని గ్రహించాలి.

ద్రవిడ పార్టీల వేచి చూసే ధోరణి 

రాజకీయాలు చాలా క్రూరమైనవి. డీఎంకే , అన్నాడీఎంకేలు ఇప్పుడే విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించవు. ఎందుకంటే, ప్రజలు ఒక కొత్త మార్పును కోరుకుని విజయ్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడే ఆయనను అడ్డుకుంటే ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందని ఆ పార్టీలకు తెలుసు. అందుకే, వారు కనీసం రెండేళ్ల పాటు విజయ్ పాలనను నిశితంగా గమనిస్తారు. ఆ సమయంలో విజయ్ చేసే ప్రతి చిన్న తప్పును భూతద్దంలో చూపిస్తూ, ప్రజల్లో ఆయనపై ఉన్న  హీరో " ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే పనిలో నిమగ్నమవుతారు.

 రీల్ హీరో vs రియల్ పర్ఫార్మెన్స్ 

విజయ్ ఇప్పటి వరకు సినిమాల్లో ఒకే ఒక్క ఫైట్‌తో లేదా ఒక ఎమోషనల్ డైలాగ్‌తో సమస్యలను పరిష్కరించడం చూపిస్తూ వచ్చారు. కానీ రియల్ లైఫ్ లో పరిపాలన అనేది భిన్నమైన అంశం. మేనిఫెస్టోలో ఇచ్చిన భారీ హామీలను అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు కావాలి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న తమిళనాడును గట్టెక్కించడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఆయనకు అతిపెద్ద సవాలు. అంచనాలు ఆకాశంలో ఉన్నప్పుడు, ఫలితాలు సామాన్యంగా ఉంటే ప్రజల్లో అసహనం చాలా వేగంగా మొదలవుతుంది. ఆ అసహనాన్ని క్యాష్ చేసుకోవడమే ద్రవిడ పార్టీల తదుపరి వ్యూహం.

 జమిలి ఎన్నికల ముప్పు  

విజయ్ ప్రభుత్వం గనుక ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే, కేంద్రం ప్రతిపాదిస్తున్న  జమిలి ఎన్నికల అంశం ఆయనకు శాపంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలా ద్రవిడ పార్టీలు పావులు కదిపితే, విజయ్ తన ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోలేక పోవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకేలు తమ క్యాడర్‌ను కాపాడుకుంటూనే, టీవీకే వైపు వెళ్లిన ఓటర్లను మళ్ళీ తమవైపు తిప్పుకునేందుకు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 అంచనాల భారమే అతిపెద్ద శత్రువు 

విజయ్ కి ఉన్న అతిపెద్ద శత్రువు విపక్షాలు కాదు, ఆయన మీద ప్రజలకు ఉన్న విపరీతమైన అంచనాలే. ఎంజీఆర్ లేదా జయలలిత స్థాయి మేజిక్ ను విజయ్ నుంచి జనం ఆశిస్తున్నారు. పరిపాలనలో ఏమాత్రం తడబడినా, సినిమాలు వేరు, రాజకీయం వేరు  అనే ముద్ర ఆయనపై బలంగా పడిపోతుంది. ఒకసారి ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం మొదలైతే, దానిని మళ్ళీ మార్చడం అసాధ్యం. అప్పుడు ద్రవిడ పార్టీలు తమదైన రాజకీయం మొదలుపెట్టి, మళ్ళీ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటాయి.

  విజయ్ కి ఇప్పుడు దొరికిన విజయం ఒక సువర్ణావకాశం అలాగే ఒక హెచ్చరిక కూడా. ఆయన మాటల నుంచి చేతల్లోకి మారి, అద్భుతమైన పాలన అందిస్తేనే ఈ ద్రవిడ కూటముల వ్యూహాల నుంచి తప్పించుకోగలరు. లేనిపక్షంలో, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆయన ఒక  స్వల్పకాలిక సంచలనం గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాజకీయ రణక్షేత్రంలో విజయ్ కి అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది.

టాప్ హెడ్ లైన్స్

BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget