అన్వేషించండి

Revanth Reddy BRS Allegations: రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ - ఆరోపణల హోరులో కాంగ్రెస్ సైలెన్స్ వెనుక వ్యూహమేంటి?

Revanth Reddy vs KTR : బీఆర్ఎస్ అగ్రనేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు వైరల్ అయ్యాయి. కానీ రేవంత్ కుటుంబంపై బీఆర్ఎస్ ఆరోపణలు హైలెట్ కాలేదు. కాంగ్రెస్ కూడా స్పందించలేదు. దీనికి కారణమేంటి?

BRS Allegations Revanth Family:  తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు రోజురోజుకూ మరింత పదునెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా బిఆర్ఎస్ అధినేతలు కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణపై చేస్తున్న ఆరోపణలు మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌గా మారుతుండగా.. దానికి పోటీగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులు, వ్యాపార లావాదేవీలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు మాత్రం ప్రజా చర్చగా మారడంలో విఫలమవుతున్నాయి. ఒక వైపు సీఎం విమర్శలకు కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘ ప్రెస్ మీట్లు పెట్టి వివరణలు ఇస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ విమర్శలను పెద్దగా పట్టించుకోవడం  లేదు. 

 స్వయంగా ఆరోపణలు చేసిన రేవంత్ 

దీనికి ప్రధాన కారణం ఆరోపణలు గుప్పించే  నాయకత్వ స్థాయి, కమ్యూనికేషన్ వ్యూహం లో ఉన్న వ్యత్యాసమేనని  భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా మైక్ ముందుకొచ్చి నేరుగా కేటీఆర్, హరీష్ రావుల పేర్లను ప్రస్తావిస్తూ దాడి చేస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం సీఎం కుటుంబంపై చేసే ఆరోపణలను పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ ద్వారా డిజిటల్ వేదికలపైకి వదులుతోంది. కేటీఆర్, హరీష్ రావు లాంటి అగ్రనేతలు నేరుగా ముందుండి ఈ ఆరోపణలకు బాధ్యత తీసుకోకపోవడం వల్ల, ఇవి కేవలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చేసే వ్యక్తిగత కామెంట్లు,  పాయింట్లు లేని డిజిటల్ డ్రామా గా మాత్రమే జనాల్లోకి వెళ్తున్నాయి.

ఆధారాలు అని చెబుతున్నవి ఆధారాలేనా?         

మరోవైపు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో విశ్వసనీయత, ఆధారాల కొరత స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి కుటుంబ వ్యాపారాలు , ఆస్తులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ విడుదల చేస్తున్న పోస్టులు, పేపర్ క్లిప్పింగులు క్షేత్రస్థాయి ఆధారాలతో కాకుండా ఆరోపణల స్థాయిలోనే ఉండిపోతున్నాయి. సరైన అధికారిక పత్రాలు లేకుండా ప్రతిరోజూ చేసే ఈ దాడి పట్ల సాధారణ ప్రజల్లో  పొలిటికల్ సాచ్యురేషన్ పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో కూడా వీటికి ఆశించిన స్పందన లభించడం లేదు.

స్పందించే అంత పక్కాగా లేవని భావన

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ,  సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలకు సైలెంట్‌గా ఉండటం కూడా ఒక పక్కా వ్యూహంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్షం నుంచి వచ్చే ప్రతి చిన్న విమర్శకూ సీఎం స్థాయిలో సమాధానం ఇస్తే, ఆ ఆరోపణకు అనవసరంగా హైప్ ఇచ్చినట్లవుతుందనేది కాంగ్రెస్ డిజిటల్ ప్లానర్స్ ఆలోచన. ప్రతిపక్ష నాయకులే రక్షణ ధోరణిలోకి   వెళ్లి సుదీర్ఘ వివరణలు ఇస్తుండటంతో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటూనే చట్టపరమైన చర్యలు  తీసుకోవడం ద్వారా ఆ వార్తలకు బ్రేక్ వేస్తోంది. బీఆర్ఎస్ చేస్తున్న మరొక ప్రధాన వ్యూహాత్మక తప్పిదం.. తమ పార్టీ అగ్రనాయకత్వం కాకుండా సోషల్ మీడియా వింగ్ నేతలను  విజిల్ బ్లోయర్స్ గా ప్రొజెక్ట్ చేయడం! కేటీఆర్ లేదా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు బయటపెడితే వచ్చే పొలిటికల్ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. కానీ ఇన్ఛార్జ్‌ల ద్వారా ఆరోపణలు చేయించి, ప్రభుత్వం వారిపై కేసులు పెట్టగానే  ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అంటూ కేటీఆర్ ట్వీట్లు చేయడం వల్ల.. ప్రజలకు ఇది కేవలం ఒక  లీగల్ ,డిజిటల్ ఫైట్ లాగానే కనిపిస్తోంది తప్ప, నిరూపించబడిన పెద్ద స్కామ్‌లాగా అనిపించడం లేదని అనుకుంటున్నారు. 

రేవంత్ పై డైరక్ట్ ఎటాక్ ఎందుకు చేయడం లేదు? 

 విమర్శలకు పొలిటికల్ ఇమేజ్, స్పష్టమైన ఆధారాలు తోడైనప్పుడే అవి ప్రజల్లో నానుతాయి. రేవంత్ రెడ్డి విసురుతున్న పొలిటికల్ పంచ్‌లకు ప్రత్యక్షంగా కౌంటర్ ఇస్తూ రక్షణలో పడిపోయిన బీఆర్ఎస్, సీఎం కుటుంబంపై చేసే ఆరోపణల్లో మాత్రం  రెండో శ్రేణి నాయకత్వాన్ని  వాడటం ద్వారా పెద్ద వ్యూహాత్మక తప్పిదమే చేసింది. ఈ డిజిటల్ వార్తల్లో మైండ్ గేమ్‌ను గెలవాలంటే బీఆర్ఎస్ తన దాడి వ్యూహాన్ని, నాయకత్వ బాధ్యతను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP ZPTC MPTC Election Results: పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ రికవరీ - అయినా దక్కని మైలేజ్.. జగన్ చేసిన వ్యూహాత్మక తప్పు ఇదేనా?
పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ రికవరీ - అయినా దక్కని మైలేజ్.. జగన్ చేసిన వ్యూహాత్మక తప్పు ఇదేనా?
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Embed widget