అన్వేషించండి

Modi In Ramagundam : సింగరేణిని ప్రైవేటీకరణ పచ్చి అబద్దం- తప్పుడు ప్రచారంతో రెచ్చగొడుతున్నారని మోదీ విమర్శ !

సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం వాటా ఉందని.. ప్రైవేటు పరం చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం ప్రైవేటీకరణ చేయబోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Modi In Ramagundam : సింగరేణిని ప్రైవేటు పరం చేస్తామంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ప్రధాని మోదీ ఖండించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని.. అలాంటి ప్రచారం శుద్ద అబద్దమని స్పష్టం చేశారు. రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌ను జాతికి అంకితం చేసిన తర్వాత మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సింగేరేణి ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇచ్చారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతమేనని.. సింగరేణిని ప్రైవేటు పరం చేసే అధికారం రాష్ట్రం చేతుల్లోనే ఉందన్నారు.  సింగరేణిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా..   తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలన్నారు.,  మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. కేంద్రం వాటా కూడా విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  ఈ రోజు హైదరాబాద్ నుంచి సింగరేణి ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న వారికి నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. 

రామగుండం ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరిందన్న ప్రధాని 

మోదీ తెలుగులో స్పీచ్‌ను మొదలు పెట్టారు.  తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో 70 నియోజకవర్గాల్లోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. వారందరికీ స్వాగతం అంటూ అభినందనలు తెలిపారు.   రామగుండం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇప్పుడు జాతికి అంకితం చేశామన్నారు. లక్ష్యాలు పెద్దగా ఉన్నప్పుడు సరికొత్త పద్ధతులను అవలంబించాలని మోడీ అన్నారు.  కొత్త వ్యవస్థను రూపొందించాలని.. దేశ ఫర్టిలైజర్ రంగం దీనికి ఒక ఉదాహరణ అని చెప్పారు. మన దేశం ఎరువుల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడిందని.. యూరియా కోసం ఉన్న పరిశ్రమల్లో టెక్నాలజీ పాతవి అవ్వడం వల్ల మూతపడ్డాయన్నారు. అందులో ఒకటి రామగుండం అని చెప్పారు.  ఎరువుల కొరతతో రైతులు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేదన్నారు. 2014లో 100 శాతం అక్రమ రవాణాను కేంద్ర ప్రభుత్వం ఆపగలిగిందని గుర్తు చేశారు. 

దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు బలోపేతం అవుతోందన్న మోదీ 

 రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోందని... కొన్ని చోట్ల యుద్ధాల వల్ల ఆ ప్రభావం మన దేశంపైనా పడుతోందన్నారు. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితలు మధ్య కూడా ఇంకో విషయం ప్రముఖంగా వినిపిస్తోందన్నారు.  భారత్ త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుందని నిపుణులు అంటున్నారని చెప్పారు. 1990 తర్వాత ఈ 30 ఏళ్లలో జరిగిన వృద్ధి ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే అవుతుందని నిపుణులు అంటున్నారని తెలిపారు.

ఫ్యాక్టరీని పరిశీలించి జాతికి అంకితం చేసిన ప్రధాని 

అంతకు ముందు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని  ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. తెలంగాణతో పాటు..దక్షిణాది రాష్ట్రాల్లో రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ కర్మాగారం ద్వారా ఎరువుల కొరత తీరనుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో  రోజుకు 2200 టన్నుల అమోనియా.. 3850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget