News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Congress on PM Modi: 'మోదీ ఓ అహంకారి..!' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. ప్రతిపక్షాలు ఫైర్!

ప్రధాని మోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలు మోదీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓ అహంకారి అంటూ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ఆధారంగా కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీపై ఆరోపణలు చేస్తున్నాయి. సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికే వైరల్ అయింది.

ఈ వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మోదీపై విమర్శలు కురిపించింది. కాంగ్రెస్ సీనియర్ మల్లికార్జున ఖర్గే సహా పవన్ ఖేరా వంటి నేతలు మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

" ప్రధాని మోదీ ఓ అహంకారని మేఘాలయ గవర్నర్ శ్రీ సత్యపాల్ మాలిక్ బహిర్గతంగా చెప్పారు. రైతు సమస్యలపై ఆయన మోదీతో చర్చించేందుకు వెళ్తే ప్రధాని ఇలా మాట్లాడారని ఆయన అంటున్నారు. నరేంద్ర మోదీ జీ.. ఇది నిజమేనా?                                                 "
-మలికార్జున ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత
 
మోదీ అవే వింటారు..

గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోపై ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. 

" సాగు చట్టాలపై చేసిన పోరాటంలో 500 మంది రైతులు చనిపోయారని మోదీతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెబితే ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి నిజాలు వినే పరిస్థితిలో ప్రధాని మోదీ లేరు. అందులోనూ గవర్నర్ చెబితేనే వినలేదు.. ఇక ప్రజలు చెబితే ఏం వింటారు? ఆయనకు ప్రశంసలే కావాలి.                                            "
-అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు

వైరల్ వీడియో..

రైతుల ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ మేరకు మాట్లాడారు.

" రైతుల సమస్యలపై చర్చించినప్పుడు ఐదు నిమిషాల పాటు ప్రధానితో వాగ్వాదం జరిగింది. 500 మంది రైతులు మరణించారని ప్రశ్నించినప్పుడు.. మోదీ చాలా అహంకారిగా స్పందించారు. 'నా కోసం చనిపోయారా?' అని అన్నారు. మీరు ప్రధానిగా ఉన్నప్పుడు చనిపోయారని నేను చెప్పాను.                                         "
-సత్యపాల్ మాలిక్​, మేఘాలయ గవర్నర్‌

Also Read: BTS Jungkook Instagram Post: అరె ఏంట్రా ఇది.. పప్పీలతో పడుకుంటే 10 లక్షల లైక్‌లా.. గిన్నిస్ రికార్డ్ కూడా!

Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ

Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Jan 2022 06:07 PM (IST) Tags: CONGRESS Amit Shah Narendra Modi Asaduddin Owaisi Meghalaya mallikarjun kharge Satya Pal Malik Pawan Khera

ఇవి కూడా చూడండి

KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్

KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

Roja on Brahmani: అవినీతిపరుడికి మద్దతుగా మోత మోగించాలా ఇదెక్కడి విడ్డూరం- బ్రాహ్మణికి రోజా కౌంటర్

Roja on Brahmani: అవినీతిపరుడికి మద్దతుగా మోత మోగించాలా ఇదెక్కడి విడ్డూరం- బ్రాహ్మణికి రోజా కౌంటర్

Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట

Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట

YSRCP I PAC : ప్రశాంత్ కిషోర్ లేని లోటు తెలుస్తోందా ? వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !

YSRCP I PAC :  ప్రశాంత్ కిషోర్ లేని లోటు తెలుస్తోందా ?  వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !

టాప్ స్టోరీస్

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా