అన్వేషించండి

Pawan Kalyan Pithapuram: పిఠాపురం పవన్ కల్యాణ్ కుప్పం- తిరుగులేని నియోజకవర్గంగా మార్చుకునే ప్లాన్ అమలు చేస్తున్నారా?

Pithapuram Model: పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గాన్ని 1,500 కోట్లతో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారు. అభివృద్ధే ప్రధాన అజెండాగా పొలిటికల్ పట్టు సాధించేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Pawan Kalyan Pithapuram Development:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త డెవలప్‌మెంట్ మోడల్ కు శ్రీకారం చుట్టారు. సాధారణంగా నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గాన్ని సందర్శిస్తారనే విమర్శలకు భిన్నంగా, అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఏకంగా రూ. 1,500 కోట్ల భారీ బడ్జెట్‌తో  పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇది కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన శాశ్వత పట్టు  సాధించే వ్యూహంలో భాగమని  భావిస్తున్నారు.
  
 అభివృద్ధే అజెండాగా పవన్ కళ్యాణ్ రాజకీయం!  

పవన్  పిఠాపురంలో  గ్రామీణ పర్యావరణం, సుందరీకరణ, ఆధునిక వసతులు,  స్థానిక పాలనా సంస్కరణలను ఒకేసారి పరుగులు తీస్తున్నారు.  పిఠాపురం వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలలో భూగర్భ జలాల పునరుద్ధరణ ,  చెరువుల సుందరీకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఫకృద్ధీన్ పాలెంలో మైసమ్మ చెరువును రూ. 73 లక్షలతో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్‌లతో ఆధునీకరించి స్థానికులకు ఆహ్లాదకరమైన ప్రాంతంగా మార్చారు. ఇదే బాటలో నియోజకవర్గవ్యాప్తంగా రూ. 6 కోట్లకు పైగా వ్యయంతో 14 చెరువులకు కొత్త శోభ తీసుకువస్తున్నారు. దీనికి తోడు, జాతీయ రహదారి సమీపంలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1.83 కోట్లతో ఆవిష్కరించిన పీఠికాపుర వనం  పట్టణ అటవీ ప్రాజెక్టు, పర్యావరణం మరియు ప్రజారోగ్యం పట్ల ఆయనకున్న స్పష్టమైన విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రాథమిక వ్యవస్థల  ప్రక్షాళన   

కేవలం పైపైన పనులకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవస్థలను పవన్ ప్రక్షాళన చేస్తున్నారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు , ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణ, మోడల్ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ వంటి సుదీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. పిఠాపురం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం  కూడా కావడంతో, ఇక్కడి పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు తగిన వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలు వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందేందుకు పవన్ కళ్యాణ్ పాలనాపరమైన సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కి స్వయంప్రతిపత్తి హోదా కల్పించడం మైలురాయిగా చెప్పవచ్చు. కాకినాడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఈ సంస్థ, నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతులు, ఆర్థిక వృద్ధి, మరియు నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అధికారిక యంత్రాంగాన్ని నేరుగా రంగంలోకి దించడం ద్వారా పనుల్లో జాప్యానికి తావులేకుండా  స్పీడ్ గవర్నెన్స్ ను పరిచయం చేశారు.

ఓ తిరుగులేని నియోజకవర్గంగా మార్చుకునే ప్లాన్  

 పవన్ కళ్యాణ్ తన పంథాను స్పష్టంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓటమిని చవిచూసిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్, ఒక నియోజకవర్గాన్ని తిరుగులేని కోటగా మార్చుకోవాలంటే అభివృద్ధి అజెండా నే బలమైన మార్గమని నమ్ముతున్నారు. పిఠాపురం ప్రజల్లో  మా ఎమ్మెల్యే మాకు అండగా ఉన్నారు, పనులు చేసి చూపిస్తున్నారు  అనే బలమైన నమ్మకాన్ని కలిగించడం ద్వారా, భవిష్యత్తులో ఈ స్థానంలో ఎవరూ ఆయనను సవాలు చేయలేని విధంగా రాజకీయంగా స్థిరపడే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒక వైపు రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సొంత నియోజకవర్గంపై ఈ స్థాయిలో నిధులు, సమయం కేటాయించడం సాధారణ విషయం కాదు. పిఠాపురంలో పవన్ సాధించే విజయం లేదా ఇక్కడ సృష్టించే మోడల్ డెవలప్‌మెంట్ , భవిష్యత్తులో జనసేన పార్టీ పాలనా విధానానికి ఒక బెంచ్‌మార్క్‌గా మారే అవకాశం ఉంది.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget