News
News
X

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ల కోరిక ఒకటి నెరవేరింది- మరి రెండోది నెరవేరుతుందా?

సినీయర్లను, రేవంత్ వర్గీయులను ఒక్కటి చేయడం, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని రంగం సిద్ధం చేయడం. మరి ఠాక్రే తనకున్న అనుభవంతో ఈ సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ నేతలు ఏ రకంగా ఒక తాటిపైకి తీసుకొస్తారో చూడాలి. 

FOLLOW US: 
Share:

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు విజయం సాధించారు. అనుకున్న విధంగా ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ తెలంగాణ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి ఏఐసిసి తప్పించి, గోవా ఇన్ ఛార్జ్ గా పంపించింది. మహారాష్ఱ్రాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాణిక్ రావు ఠాక్రేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కు ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఇన్నాళ్లు ఇన్ ఛార్జ్ ను మార్చాలని బహిరంగంగానే డిమాండ్ చేసిన సీనియర్ల డిమాండ్ ఒకటి నెరవేరింది. ఇక సీనియర్ల డిమాండ్లలో మరొకటి నెరవేరుతుందా ?  లేదా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.

నిన్నటివరకు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు కమిటీల నియామకంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఒక్కటయ్యారు. మూకుమ్మడిగా తిరుగుబాటు లేవదీశారు. దీంతో దిగివచ్చిన అధిష్టానం ఆఘమేఘాల మీద శాంతి దూతగా దిగ్విజయ్‌ సింగ్‌ ని పంపింది. ట్రబుల్‌ షూటర్ కి సమస్యలన్ని విన్నవించడంతో పాటు ప్రధాన డిమాండ్లను ముందుంచారు. అందులో మొదటిది ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ని తొలగించాలని పట్టుబట్టారట. ఇక రెండవది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ని తప్పించాలని కూడా స్పష్టం చేశారని వార్తలు వినిపించాయి. సీనియర్ల సమస్యలను విన్న దిగ్విజయ్‌ ఎంత స్పీడులో వచ్చారో అంతే వేగంతో ఢిల్లీకి చేరి అధిష్టానానికి విషయాన్ని వివరించారట.

తెలంగాణ కాంగ్రెస పార్టీ పై ఖర్గే నజర్. 

ఖర్గే అధ్యక్షత కాంగ్రెస్‌ పెద్దలంతా డిసైడ్‌ ఎట్టకేలకు మాణిక్కం ఠాగూర్‌ ని తప్పుకోమని సూచించడంతో ఆయన రాజీనామా చేయడంతో పాటు తెలంగాణ సోషల్‌ మీడియా గ్రూపుల నుంచి కూడా తప్పుకున్నారు. అయితే ఈ వార్త సీనియర్లకు కాస్తంత సంతోషం కలిగించినా ఇక మరో డిమాండ్‌ పై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. జనవరి 26నుంచి కాంగ్రెస్ పార్టీ  హాత్‌ సే యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఇది రేవంత్ రెడ్డి పాదయాత్ర అని ప్రొజెక్ట్ చేస్తున్నారు రేవంత్ వర్గీయులు. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అని అంటున్నారు.  ఇలాంటి తరుణంలో జరిగిన కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల కార్యక్రమానికి భట్టి , మధుయాష్మికీ మినహాయించి మిగిలిన సీనియర్లంతా హాజరుకాలేదు. ఖర్గే ఫోన్‌ చేసి మరీ సీనియర్లంతా హాజరుకావాలని చెప్పినా కానీ వారు హాజరు కాకపోవడంతో పీసీసీ అధ్యక్షుడిని మార్చితే కానీ వెనక్కి తగ్గేలా లేరన్న వార్త నిజమేనన్న టాక్‌ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే రేవంత్‌ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందంటే నేను రాజీనామాకి సిద్ధమని ఆయన చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. 

ప్రియాంకాగాంధీ రాష్ట్రానికి వస్తారా? పార్టీని చక్కపెడతరా? 

ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా అన్నది కూడా అప్పుడే డిసైడ్‌ అవుతుందన్న వాదన కూడా ఉంది. అంతేకాదు ప్రియాంక గాంధీ తన నమ్మకస్తులను తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా కానీ సీనియర్లలో కొందరు రేవంత్‌ కి అనుకూలంగా ఉంటే మెజార్టీ మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకొంతమంది ఈ గొడవలు వద్దనుకొని పార్టీలు మారుతున్నారు. మళ్లీ కాంగ్రెస్‌ కి పూర్వవైభవం రావాలంటే సీనియర్లంతా కలిసి ఉండటమే కాదు జూనియర్లని రంగంలోకి దింపి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రజల్లో కూడా నేతల్లో సఖ్యత ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. అప్పటి కానీ కాంగ్రెస్‌ ని తిరిగి నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

ఠాక్రే కు సమస్యలు స్వాగతం. 
మాణిక్ రావు ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. ఠాక్రే ముందు రెండు సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి సినీయర్లను, రేవంత్ వర్గీయులనున ఒక్కటి చేయడం, రెండు ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని రంగం సిద్ధం చేయడం. మరి ఠాక్రే తనకున్న సుదీర్షరాజకీయ అనుభవంతో ఈ సమస్యలను పరిష్కరించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ రకంగా ఒక తాటిపైకి తీసుకొస్తారో చూడాలి. 

Published at : 05 Jan 2023 09:25 AM (IST) Tags: CONGRESS Revanth Reddy Manik RaoThakre

సంబంధిత కథనాలు

AP Capital issue :  ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?

AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

BJP On Jagan : దివాలా తీసిన కంపెనీ ఉద్యోగుల్లా ఏపీ ఉద్యోగుల పరిస్థితి - ప్రభుత్వ తీరుపై బీజేపీ విమర్శలు

BJP On Jagan : దివాలా తీసిన కంపెనీ ఉద్యోగుల్లా ఏపీ ఉద్యోగుల పరిస్థితి - ప్రభుత్వ తీరుపై బీజేపీ విమర్శలు

వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?

వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?

టాప్ స్టోరీస్

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం