NTR District Vellampalli : పదవి పోగానే అందరూ దూరమయ్యారు ! ఎన్టీఆర్ జిల్లాలో ఎదురీదుతున్న వెల్లంపల్లి !
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావును పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయన పదవులు ఇప్పించిన వారు కూడా మొహం చాటేయడంతో ఇబ్బంది పడుతున్నారు.
![NTR District Vellampalli : పదవి పోగానే అందరూ దూరమయ్యారు ! ఎన్టీఆర్ జిల్లాలో ఎదురీదుతున్న వెల్లంపల్లి ! None of the party leaders care about NTR Krishna district YSRCP president Vellampalli Srinivasa Rao. NTR District Vellampalli : పదవి పోగానే అందరూ దూరమయ్యారు ! ఎన్టీఆర్ జిల్లాలో ఎదురీదుతున్న వెల్లంపల్లి !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/14/aa2c00bc4795a9e5ffcd65e4d231c1bf_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మంత్రి పదవి పోయిందనే బాధలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుకు జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందనే ఆనందం ఇంత వరకూ ఉంది. కానీ ఇప్పుడు ఆయనను పార్టీ నేతలెవరూ పట్టించుకోకపోవడం లేదు. చివరికి తాను పదవులు ఇప్పించిన వారు కూడా తనను లెక్క చేయడం లేదు. దీంతో వెల్లంపల్లికి రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మంత్రి పదవి ఉంటే ఒకటి.. లేకపోతే మరొకటి అన్నట్లుగా మారింది వెలంపల్లి పరిస్దితి. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్మడి కృష్ణాజిల్లా కావచ్చు...ఎక్కడయినా ఆయన మాటే చెల్లుబాటు అయ్యింది. విజయవాడ నగర పాలక సంస్ద ఎన్నికల్లో కూడా ఆయన చెప్పిన వారికే సీట్లు ఇచ్చారు. మంత్రిగా అన్ని శక్తులు ఉపయోగించి కార్పోరేషన్ లో వైఎస్ఆర్‌సీపీకి ఎదురు లేకుండా చేశారు.
బెజవాడ కార్పొరేషన్‌లో గెలుపు వెల్లంపల్లి కృషేనని ఆయన చెప్పినట్లుగా మేయర్ పదవిని నగరాల సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి అప్పగించారు. ఇక దుర్గగుడి ఛైర్మన్ పదవి కూడ నగరాల సామాజిక వర్గానికి చెందిన పైలా సోమినాయుడు కు ఇప్పించారు. అయితే ఇప్పడు వెలంపల్లి మాజీ అయ్యారు..దీంతో పరిస్దితులు ఒక్క సారిగా మారిపోయాయి.ఆయన సొంత నియోజకవర్గంలోని మేయర్ భాగ్యలక్ష్మి,తో పాటుగా ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అసంతృప్తితో వెలంపల్లికి దూరంగా ఉంటున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో వెలంపల్లి అన్ని తానే అయ్యి వ్యవహరించారని,ఇప్పుడు కూడ ఆయన అదే పై చేయి కోసం ప్రయత్నించటంతో మేయర్ అసంతృఫ్తి వ్యక్తం చేస్తున్నారు.
వెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే మేయర్ పర్యటించినా మాజీ మంత్రికి కనీస సమాచారం ఉండటం లేదు. అదేమంటే ఆయన పార్టి కార్యకలాపాల్లో బిజిగా ఉంటారు కదా,డిస్టబ్ చేయటం ఎందుకని,మేయర్ తన వర్గం వద్ద చెబుతున్నారని ప్రచారం..ఇక దుర్గగుడి ఛైర్మన్ సొమినాయుడు రెండు సంవత్సరాలు పని చేశారు. ఆ సమయంలో కరోనా తో కాలం గడిచిపోయింది.దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మరో సారి అవకాశం ఇవ్వాలని అడిగితే పార్టి నిబందనలు ఓప్పుకోవన్నారట..దీంతో ఆయన వర్గం కూడా అసంతృఫ్తిగా ఉంది.
జిల్లా అధ్యక్షుడు అయినా నియోజకవర్గంలోనే వెలంపల్లికి అసంతృప్తి తప్పటం లేదు.ఈ నేపద్యంలో జిల్లా పార్టి కార్యకలాపాలు పై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారని,ఎన్నికల సమయానికి ఈ అసంతృప్తులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే అంశం పై ప్రస్తుతం విస్తృతంగా చర్చ నడుస్తుంది. అందర్నీ సమన్వయం చేసుకోవాల్సిన పదవి ఇస్తే.. ఇప్పుడు ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడంతో పార్టీని ఎలా బలోపేతం చేయాలా అని వెల్లంప్లలి టెన్షన్ పడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)