By: ABP Desam | Updated at : 26 Jun 2022 07:54 PM (IST)
ఆత్మకూరులో వైసీపీ విజయం
AP Politics : ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ ఆశించినా 82,888 మెజార్టీ ఆ పార్టీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి సాధించగలిగారు. ఇంతకీ ఆత్మకూరు ఉపఎన్నికల ఫలితం చెప్పేదేంటి? రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మరో రెండేళ్లలో రాబోతున్న సందర్భంలో ఆత్మకూరు ఉపఎన్నికల ఫలితాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి?
గణాంకాలు ఇలా
పోస్టల్ బ్యాలెట్ల లెక్క కూడా తీస్తే విక్రమ్ రెడ్డి మెజార్టీ 82,888 అని తెలుస్తోంది.
వైసీపీ హవా..
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గౌతమ్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా విక్రమ్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. వైసీపీ బలం పెరిగిందనే చెప్పాలి. ఇక్కడ మేకపాటి కుటుంబంపై ఉన్న సింపతీ, వైసీపీ సంక్షేమ పథకాలు ఇలా కారణాలేవైనా వైసీపీ బలం మాత్రం పెరిగింది. 64 శాతం మాత్రమే పోలింగ్ జరిగినా ఈ స్థాయిలో మెజార్టీ వచ్చిందంటే ప్రచారంలో వైసీపీ కృషి ఫలించినట్టే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
బీజేపీ బలమెంత..?
ఏపీలో బీజేపీ సైజ్ ఎంత అంటూ మంత్రి అంబటి సెటైర్ వేసినా.. వాస్తవానికి బీజేపీ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ప్రతిపక్షాలేవీ పోటీలో లేనప్పుడు కూడా కనీసం బీజేపీకి 20 వేల ఓట్లు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. టీడీపీ, జనసేన సానుభూతిపరులెవరూ బీజేపీకి అనుకున్న స్థాయిలో ఓట్లు వేయలేదు. ఓ సామాజిక వర్గం మాత్రం బీజేపీ వెంటే ఉంది. బీజేపీ ఒంటరి పోరు ఏమాత్రం ఫలించలేదని చెప్పాలి. ఓటమి ముందే ఊహించినా మరీ డిపాజిట్ గల్లంతు కావడం ఆ పార్టీ నేతల్ని ఆలోచనలో పడేసింది.
టీడీపీ, జనసేనకు క్లారిటీ..
పదే పదే వైసీపీ పథకాలపై విమర్శలు చేస్తున్న టీడీపీ, జనసేన ఈ ఉప ఎన్నికతో ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం అనే ఆరోపణలు వచ్చినా వైసీపీకి భారీ మెజార్టీ కట్టబెట్టారు ప్రజలు. దీంతో టీడీపీ, జనసేన ఆలోచన పడినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలను నమ్ముకున్న వైసీపీ ప్రచారం దూసుకుపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత అంటున్న ప్రతిపక్షాలు మాత్రం నీరసపడ్డాయి. ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
Madhy Yaski : కాంగ్రెస్లో ఎల్బీనగర్ రగడ - మధుయాష్కీకి టిక్కెట్ దక్కేనా ?
Telangana Congress List : తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా రెడీ - దసరా కల్లా పూర్తి లిస్ట్ ప్రకటించే చాన్స్ !
మీసాలు తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక- సమావేశాలు ముగిసేవరకు ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్- స్క్రీనింగ్ కమిటీలో యాష్కీ, కోమటిరెడ్డి
AP Assembly Sessions 2023: దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్- అదే స్థాయిలో రియాక్ట్ అయిన బాలకృష్ణ- సభ వాయిదా
ఖలిస్థాన్ వివాదం భారత్ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్పై శుక్రవారం విచారణ !
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
/body>