అన్వేషించండి

Nara Brahmani : పొలిటికల్ కామెంట్లు చేస్తున్న నారా బ్రహ్మణి - రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లేనా..?

నాారా బ్రాహ్మణి తెలుగుదేశం పార్టీ కోసం రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ దిశగానే సన్నాహాలు చేసుకుంటోంది.

 

Nara Bramhani : టీడీపీ శ్రేణుల్లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు.. నారా బ్రహ్మణి. తెలుగుదేశం అధినేత.. చంద్రబాబును అరెస్ట్ చేయడం.. యువనేత లోకేష్ ను అరెస్టు చేస్తారని చెబుతుండటంతో.. ఎప్పటి నుంచో అడపా దడపా వినిపిస్తున్న ఆ పేరు మరి కాస్త ఎక్కువుగా లౌడ్ గా వినిపిస్తోంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. పార్టీలో లీడ్ రోల్ ప్లే చేయాలని చాలా సందర్భాల్లో చర్చకు వచ్చినా.. తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం ఆమెను ముందుకు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనివార్యమయ్యేలా ఉందా..? అందుకు ఆమె సిద్ధమవుతున్నారా..

ప్రజా సమస్యలపై స్పందిస్తున్న నారా బ్రాహ్మణి 

రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలపై పోలీసుల దాడులను తప్పు పడుతూ చేసిన పోస్ట్ అది... తన మామ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. కుటుంబ సభ్యురాలిగా ఆమె బయటకు వచ్చి..టీడీపీ శ్రేణులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన వారితో కలిసి మాట్లాడారు. అంతవరకూ అర్థం చేసుకోదగిందే. కానీ బ్రహ్మణి ఇప్పుడు చేసిన ఈ ట్వీట్ ... పూర్తిగా రాజకీయాలకు సంబంధించింది. అసలు మూడేళ్లుగా ట్విటర్ లో యాక్టివ్ గా లేని బ్రహ్మణి ఓ పది పదిహేను రోజులుగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన విషయాలను మాత్రమే పోస్టు చేస్తున్నారు. కానీ రెండు రోజుల కిందట ఈ పోస్టు చూస్తే..అది ఆయన అరెస్టుకు సంబంధం లేనిది. జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఓ మహిళా అంశాన్ని ఎంచుకున్నారు. ఇక నుంచి ఇలాంటి వాటిపై ఆమె నుంచి మరిన్ని రావొచ్చని భావించొచ్చేమో.. ?

మీడియా ఎదుట తడుకోకుండా సమాధానాలు

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఓ పదిరోజుల కిందట రాజమండ్రిలో నిర్వహించిన ర్యాలీలో బ్రహ్మణి పాల్గొన్నారు. అప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం డొల్ల అని తన కొడుకుకు కూడా అర్థం అవుతుందని సైటైర్లు వేశారు. . ఎప్పటి నుంచో బ్రహ్మణి బయటకు రావాలని.. ఆమె పార్టీకి ట్రంప్ కార్డు అవుతుందని భావిస్తున్న క్యాడర్.. ఆ సంఘటనతో ఫుల్ ఖుషీ అయిపోయారు. కొన్ని రోజులు రాజకీయ సభల్లో పాల్గొంటే ఆమె మరింత రాటుదేలుతారని.. నందమూరి వారసురాలిగా ఆమె రాక పార్టీని మరో మెట్టు ఎక్కిస్తుందని వారంతా ఆశిస్తున్నారు. అయితే బ్రహ్మణి రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఆ సంకేతాలు ఇవ్వలేదు. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఆ బాధ్యతలను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారు.. కానీ నారా బ్రాహ్మణి టీడీపీ తరపున యాక్టివ్‌గా రాజకీయాలు చేయాలని క్యాడర్ నుంచి డిమాండ్ పెరుగుతోంది. 

లోకేష్ ను అరెస్టు చేస్తే తప్పదా.. ?

చంద్రబాబు తర్వాత లోకేషే అంటూ వైఎస్సార్సీపీ క్యాడర్ ఊరూ వాడా మాట్లాడుతూనే ఉంది. మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ అదే మాట అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడూ మానసికంగా అందుకు సిద్ధమైపోయింది. ఇన్నర్ రింగు రోడ్డు కేసులో లోకేష్ ను ముద్దాయిగా చేర్చడంతో అది ఖాయం అయిపోయింది కూడా. ఈ తరుణంలోనే ఆగిపోయిన యువగళం యాత్రను మళ్లీ మొదలుపెడుతున్నా అంటూ.. లోకేష్ ప్రకటించారు. శుక్రవారం నుంచి యాత్ర మొదలుకాబోతోంది. మరి లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే.. ప్రజల్లోకి వెళ్లేది ఎవరు అనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి మాటలతో కాకుండా చేతలతో రాజకీయాలు ప్రారంభించేశారు.  చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుండి రాజమండ్రి క్యాంప్ సైట్ లోనే ఉంటున్నారు. ఇద్దరూ దాదాపుగా ప్రతీరోజూ ఏదో ఓ రాజకీయ ప్రకటన చేస్తున్నరు. ఈ ప్రకటనలు అన్నీ  వైరల్ అవుతున్నాయి. 

ప్రజాసమస్యలపై స్పందిస్తున్న నారా బ్రాహ్మణి 

 జరగబోయే దానిపై ఓ స్పష్టత వచ్చినందునేమో.. నారా బ్రాహ్మణి ఎగ్రెసివ్ గా ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు.  అంగన్‌వాడి మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత పై పోలీసుల వ్యవహరించిన తీరుపై   ఘాటుగా స్పందించారు. ఏపీలో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస చూసి షాక్ కు గురవుతున్నానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్‌వాడి కార్మికులపై దాడులు దుర్మార్గమన్నారు. బ్రాహ్మణి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. 

రాజమండ్రి క్యాంప్ సైట్‌లో రాజకీయ సమావేశాలు

ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘిభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో రాజకీయాలు చర్చిస్తున్నారు. జనసేన నేతలు వచ్చి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. దాదాపుగా ప్రతి రోజూ రాజకీయాలపై మాట్లాడుతున్నారు ఇక ముందు ఈ రాజకీయం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నరాు.  

తండ్రీ కూతుళ్లు ప్రచార బాధ్యతలు

చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజే బాలయ్య నేనున్నానంటూ.. భరోసా ఇచ్చారు. తానే రంగంలోకి దిగి జనాల్లోకి వస్తానన్నారు. ఆయనకు తోడుగా ఆయన కూతురు వస్తే. .ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువుగా ఉండనుంది. బ్రహ్మణి టీడీపీకి కచ్చితంగా ఎసెట్ అవుతారని.. కేవలం ఆ పార్టీ నేతలే కాదు.. బయట పార్టీల్లోనూ ఊహాగానాలున్నాయి. కానీ చంద్రబాబు, లోకేష్ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నందున ఆమె బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చనుకున్నారు. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోవడంతో ఆమె అవసరం కనిపిస్తోంది. 

జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టొచ్చా.. ?

తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటన్నది.. దాదాపు 15ఏళ్లుగా ప్రశ్నార్థకమే. 2009 తర్వాత జూనియర్ పార్టీకి దాదాపు దూరం అయ్యారు. పార్టీకి దగ్గరగా లేరు... అలాగని దూరం జరిగినట్లూ చెప్పలేదు. తెలుగుదేశం పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు.. పార్టీ బాధ్యతలను ఆయన తీసుకుంటారని.. చంద్రబాబు ఉన్నంత కాలం రాజకీయాల్లోకి రారని.. జూనియర్ అభిమాన వర్గం, తెలుగుదేశం వ్యతిరేక వర్గం ప్రచారం సాగిస్తూ ఉన్నాయి. జూనియర్ చాన్స్ కోసం చూస్తున్నారన్నది వీళ్ల అంచనా.. అయితే బ్రహ్మణితో జూనియర్ కు చెక్ పెట్టొచ్చు అని ఆమె రాకను కోరుకునే వారు ఆశిస్తున్నారు. చంద్రబాబు పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్నారనే విమర్శ ఉన్నందున నందమూరి వారసురాలిగా ఆమె వస్తే.. దానిని ప్రశ్నించే సాహసం ఇంకెవరూ చేయరు అని ఆమె సపోర్టర్స్ భావిస్తున్నారు. బ్రహ్మణి ఇంత వరకూ పెద్దగా యాక్టివ్ రాజకీయాల్లో లేరు. 2019లో లేకష్ మంగళగిరి నుంచి పోటీ చేసినప్పుడు.. కొన్ని సభల్లో పాల్గొని ఓట్లు అడిగారు. అలాగే విజయవాడ, గుంటూరు లోక్ సభ నుంచి ఆమె పోటీ చేస్తారని ఎన్నికలప్పుడు వినిపిస్తూ ఉంటుంది తప్పితే.. అవి నిజం కాలేదు. మరి ఇప్పుడు పరిస్థితులు ఆమె రావలసిన అవసరాన్ని సృష్టించాయి. బ్రహ్మణి కూడా అందుకు సిద్ధమైనట్లుగా ఆమె రియాక్షన్స్ చెబుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget