అన్వేషించండి

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

బీజేపీ నేతలకు జైహనుమాన్ నినాదాలతో కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. దేవుడి పేరుతో భయపడితే భయపడబోమని ఆమె ప్రకటించారు.

బీజేపీ నేతలు తమను రెచ్చగొట్టేందుకు జైశ్రీరాం అని నినాదాలు ఇస్తున్నారని వారు అలా అంటే మనం  మనం జై హనుమాన్ అనాలని  ఎమ్మెల్సీ ‌కవిత టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకునేదిలేదన్నారు.   కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ‌కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు గెలిచేలా కార్యకర్తలు ‌కృషి చేయాలని ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారని కవిత గుర్తు చేశారు.  భారతదేశంలో చిత్రపటాన్ని మార్చి, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, నంబర్ వన్ గా నిలిపిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు.  కోరుట్ల లో ఉన్న బీడీ కార్మికులకు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్పరశ్నించారు. 

కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శకులకు దీటుగా సమాధానం చెప్పాలన్నారు.  సగర్వంగా, గులాబీ కండుగా మెడలో వేసుకుని టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని కవిత గుర్తు చేశారు.  దేశంలో అవినీతి లేకుండా పాలన అందిస్తున్న నాయకులు సీఎం కేసీఆర్ అని కవిత తెలిపారు.  తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసమని తెలంగాణలో ఉద్యోగాలు 95% స్థానికులకే వచ్చేలా చేశామన్నారు.  యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దం కావాలన్నారు.  దళిత వర్గాల కు దళిత బంధు అమలు చేస్తున్నామని..  బిసీ లకు విద్య కోసం గతంలో కేవలం 7000 మంది బీసి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉంటే, ప్రస్తుతం 281 బీసి హాస్టల్‌ ఏర్పాటు చేసి,1300 కోట్లతో లక్షా 32 వేల బీసి విద్యార్థులను చదివి స్తున్నామని గుర్తు చేశఆరు. 

 96 లక్షల విద్యార్థులకు 8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామనిమటీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను గ్రామాల్లో చర్చపెట్టాలన్నాపు,  ప్రజాస్వామ్యం లో గెలిచిన వాళ్లకు మర్యాద ఇవ్వాలన్నారు. అందుకే్ గెలిచిన ఎంపీ అరవింద్ కు 3 ఏండ్లు అవకాశం ఇచ్చినా, రైతులకు ఏం చెయ్యలేదన్నారు.  పసుపు బోర్డు బదులు తెచ్చిన ఆఫీస్ కూడా తాను తెచ్చిందేనని మనం చేసిన పనులు కూడా, వాళ్ళె చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నరాని విమర్శించారు.  అబద్దాలకు ప్రతిరూపం అరవింద్... అమెరికా వెళ్లి, అక్కడ కూడా అరవింద్ అబద్ధాలు చెప్తున్నాడని ఆరోపించారు. 

 మోదీ హయాంలో పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ భారీగా పడిపోయిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయల లాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీని ఎందుకు విమర్శించరు? పసుపు బోర్డు, ధరల పెరుగుదల పై బీజేపీ ని ఎందుకు విమర్శించరు? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ నాయకులు రైతు రచ్చబండ నిర్వహిస్తే, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపించాలని సూచించారు.  తెలంగాణ కు రావాల్సిన ‌బకాయిల గురించి పార్లమెంటు లో మాట్లాడాలని రాహుల్ గాంధీ ని కోరాల్సిందిగా జీవన్ రెడ్డి ని ప్రజలు నిలదీయాలన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
IPL 2025 Mega Auction: 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Embed widget