అన్వేషించండి

Mamata Invites Jagan : జగన్‌నూ పిలిచిన దీదీ - రానే రానన్న ఏపీ సీఎం ! బయటకొచ్చిన లేఖ

రాష్ట్రపతి ఎన్నికపై విపక్షాల సమావేశానికి వైఎస్ జగన్‌నూ మమతా బెనర్జీ ఆహ్వానించారు. ఆ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 


Mamata Invites Jagan :    రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చించేందుకు నిర్వహించేందుకు బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ మమతా బెనర్జీ ఆహ్వానం పంపారు. అయితే తమకు ఆహ్వానం అందలేదని వైఎస్ఆర్‌సీపీ చెబుతూ వస్తోంది. ఢిల్లీలో విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పారు. కానీ అదంతా అబద్దమని తాజాగా వెల్లడయింది. ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పాటు సీఎం జగన్‌కూ మమతా బెనర్జీ లేఖ రాశారు. సమావేశానికి రావాలని ఆహ్వానించారు. లేఖతో పాటు ఫోన్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తాము హాజరు కాబోమని జగన్ నేరుగానే మమతా బెనర్జీకి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
Mamata Invites Jagan : జగన్‌నూ పిలిచిన దీదీ - రానే రానన్న ఏపీ సీఎం ! బయటకొచ్చిన లేఖ


వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. అదే సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు సమావేశం అవడంతో  జాతీయ మీడియా విజయసాయిరెడ్డిని సమావేశానికి వెళ్తున్నారా అని ప్రశ్నించింది. తమకు ఆహ్వానం లేదని ఆయన చెప్పారు.

అయితే వైఎస్ఆర్‌సీపీ ఆహ్వానం ఉన్నా లేదని ఎందుకు ప్రచారం చేసుకుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి  ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతివ్వడానికి సిద్ధపడినందునే..  విపక్షాల భేటీకి హాజరయ్యే విషయంలో జగన్ వెనుకడుగు వేసినట్లుగా  చెబుతున్నారు. అయితే అసలు ఆహ్వానమే రాలేదన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది మాత్రం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకు కూడా  అర్థం కాని విషయం. తమకు ఆహ్వానం వచ్చిందని తిరస్కరించామని చెబితే కొత్తగా పోయేదేముంటుందని అంటున్నారు. 

ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్ఆర్‌సీపీ మద్దతివ్వడం ఖాయమని.. ఆ మేరకు ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనలో మోదీకి హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే రాష్ట్రానికి కావాల్సిన .. రావాల్సిన డిమాండ్లను ప్రధాని ముందు పెట్టి  ఆ మేరకు సాధించుకుని వచ్చి మద్దతివ్వాలన్న డిమాండ్లు ఏపీలో వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని..  ఎన్డీఏకే మద్దతుగా ఉంటామని తాజా పరిణామం ద్వారా వైఎస్ఆర్‌సీపీ చెప్పినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget