అన్వేషించండి

BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?

KTR BRS Independent Contest: ఒంటరి పోరే అంటూ కేటీఆర్ ఆఫ్ లైన్‌లో చెప్తున్నా, క్షేత్రస్థాయిలో బీజేపీపై సాఫ్ట్ కార్నర్ ఎందుకు ? విలీనం, పొత్తుల రూమర్లకు చెక్ పెట్టాలంటే గులాబీ బాస్ ఏం చేయాలి?

KCR Political Move:  తెలంగాణ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి  ప్రస్తుతం ఒక విలక్షణమైన, అత్యంత సంక్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గులాబీ శ్రేణులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. పార్టీ పయనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న సమయంలో   పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్గత సమావేశాల్లో  వచ్చే ఎన్నికల్లో మనది ఒంటరి పోరే.. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు అని గట్టిగా చెప్తున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆ మాటలపై ఇంకా నమ్మకం కలగడం లేదు. దీనికి ప్రధాన కారణం.. కేంద్రంలోని బీజేపీపై, మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించకపోవడమే.

బీజేపీ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తే, బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు క్రమంగా బీజేపీ వైపు మళ్లినట్లు స్పష్టమైంది. గతంలో గులాబీ వైపు నిలిచిన అర్బన్, సెమి-అర్బన్,  హిందూ ఓటర్లు గంపగుత్తగా కమలం వైపు మొగ్గు చూపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ చేసిన ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేశామని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ గట్టిగా చాటుకుంటోంది. ఇలాంటి తరుణంలో, తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని, బీజేపీకి అసలు క్షేత్రస్థాయి బలం లేదని కేటీఆర్ ప్రకటిస్తున్నారు. కానీ, తమ ఓట్లను లాగేసుకున్న బీజేపీని ధాటుగా ఎదుర్కోకుండా, కేవలం కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో పలు అనుమానాలకు తావిస్తోంది.  బీజేపీపై సాఫ్ట్ పాలిటిక్స్ నడుపుతూ.. రేపటి ఎన్నికల్లో ఆ పార్టీనే మాకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్తే ప్రజలు కన్విన్స్ అవ్వడం కష్టమేన్న అభిప్రాయం వినిపిస్తోంది.

బీజేపీతో బంధంపై ప్రచారాలను తిప్పికొట్టలేకపోతున్న బీఆర్ఎస్ 

బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ అధినాయకత్వం విఫలమవుతోంది. కవిత బెయిల్ వ్యవహారం దగ్గర నుంచి నేటి వరకు కేంద్ర సంస్థల దూకుడు తగ్గడం, పార్లమెంట్‌లో కీలక బిల్లులపై బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం వహించడం వంటి పరిణామాలు  బీజేపీ-బీఆర్ఎస్ భాయ్ భాయ్  అనే రూమర్లకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో, వార్తల్లో విలీనం లేదా పొత్తుల గురించిన రచ్చ జరుగుతూనే ఉంది. ఈ ప్రచారానికి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే కేవలం ఆఫ్‌లైన్ ప్రకటనలు సరిపోవు, క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై  ఆన్‌లైన్, ఆన్‌గ్రౌండ్  పోరాటాలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 

గ్రేటర్ ఎన్నికల్లో తేలిపోతుందా?

త్వరలో జరగబోయే గ్రేటర్  ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఒక పెద్ద యాసిడ్ టెస్ట్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలంటే.. అటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయాలను అంతే తీవ్రంగా నిలదీయాలి. అలా కాకుండా కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనే 100% ఫోకస్ పెట్టి, కేంద్రంపై చిన్న విమర్శ కూడా చేయకపోతే, ప్రజలు బీఆర్ఎస్‌ను కేవలం ఒక 'బి-టీమ్' గానే చూసే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలతో తలపడేటప్పుడు రెండు వైపులా సమానమైన దూకుడు  ప్రదర్శించినప్పుడే పొలిటికల్ సీరియస్‌నెస్ కనిపిస్తుంది. కేటీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదనే విమర్శలు పోవాలంటే.. బీజేపీ హిడెన్ ఎజెండాను కూడా గులాబీ పార్టీ అంతే ధీటుగా బట్టబయలు చేయాలి. లేదంటే, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీఆర్ఎస్ ఎంత మొత్తుకున్నా, విశ్లేషకులు గానీ, అటు ఓటర్లు గానీ దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి, సాఫ్ట్ పాలిటిక్స్ పక్కనబెట్టి తీవ్రమైన దూకుడు ప్రదర్శించడమే ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఏకైక మార్గం.  

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget