By: ABP Desam | Updated at : 06 Feb 2022 06:36 AM (IST)
జలగం వెంకట రావు (ఫైల్ ఫోటో)
వనమా రాఘవ ఉదంతంతో కొత్తగూడెం రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. నియోజకవర్గంపై పట్టుకోసం నాయకులు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న జలగం వెంకటరావు మరోమారు కొత్తగూడెంపై దృష్టి సారించారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌కు పరిమితమైన ఆయన కొత్తగూడెంకు రావడం, క్యాంప్ కార్యాలయంలో ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయంగా చర్చ సాగుతుంది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాదించిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో అప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న జలగం వెంకటరావు వర్గానికి వనమా వర్గానికి మద్య విబేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరావు నియోజకవర్గానికి ఎక్కువగా రాకపోవడం, హైదరాబాద్‌కు పరిమితం అవుతుండటంతో అప్పటి వరకు జలగం వర్గంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు వనమా వర్గానికి చేరారు. దీంతో వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించాడు
రాఘవ ఉదంతంతో మారిన రాజకీయం..
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో రాఘవ ప్రమేయం ఉండటం, ఆ తర్వాత రాఘవ అరాచకాలపై నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వనమా వెంట నాయకులు, కార్యకర్తలు సైతం తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. కొందరు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వద్దకు వెళ్లగా మరికొందరు ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు వద్దకు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు స్తబ్థుగా ఉన్న జలగం వెంకటరావు అనూహ్యంగా కొత్తగూడెంకు రావడం, క్యాంప్ కార్యాలయంలో ఉండటంతో ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. మరోవైపు వెన్నుముక శస్త్ర చికిత్స చేయించుకుని మూడు నెలలుగా హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సైతం కొత్తగూడెం చేరుకోవడం, కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి కార్యకర్తలు వేరే గూటికి చేరకుండా ఉండేందుకు తంటాలు పడుతున్నారు.
జలగం అభిమానులు తిరిగి వస్తారా..?
2018 తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తలోదారి చూసుకున్న జలగం వర్గీయులు తిరిగి ఆయన చెంతకు వస్తారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చ సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే వెంకటరావు హైదరాబాద్‌కు పరిమితం కావడంతో ఎవరి దారి వారు చూసుకున్న కార్యకర్తలు ఆయన రాకతో తిరిగి ఆయన వద్దకు చేరుతారా..? లేదా..? అనేది చర్చ జరుగుతుంది. 2014 ఎన్నికల్లో విజయం సాదించిన జలగం వెంకటరావు ఆ తర్వాత నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. 2018 తర్వాత పరిణామాలు, ఆయన నియోజకవర్గానికి రాకపోవడంతో కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. అయితే ఇప్పటి వరకు కేవలం కార్యకర్తలకు ఫోన్‌లోనే టచ్‌లో ఉంటున్న జలగం వెంకటరావు ఇప్పుడు కొత్తగూడెం చేరుకోవడంతో ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారనేది చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం కొత్తగూడెం రాజకీయాలు మాత్రం రసవత్తరంగా కొనసాగుతున్నాయి.
KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్
జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు
Roja on Brahmani: అవినీతిపరుడికి మద్దతుగా మోత మోగించాలా ఇదెక్కడి విడ్డూరం- బ్రాహ్మణికి రోజా కౌంటర్
Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట
YSRCP I PAC : ప్రశాంత్ కిషోర్ లేని లోటు తెలుస్తోందా ? వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
/body>