By: ABP Desam | Updated at : 21 Jan 2023 06:36 PM (IST)
కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం లేకనే ఓడిపోతున్నామని, ఇప్పటికైనా పార్టీ నేతలందరూ కలిసి పనిచేయాలని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. సమావేశం అజెండా మీదే మాట్లాడాలని, ఏమైనా వ్యక్తిగత అంశాలు ఉంటే రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు. ఎటువంటి వాళ్ళను అయిన క్రమశిక్షణ తప్పితే తీసేస్తారు అనే భయం ఉంటుందని అలా చెప్పానన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న పార్టీలో కనిపించాడు కాబట్టి ఈ వాఖ్యలు చేశానన్నారు. పార్టీ నేతలతో కనిపించకపోతే ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.
తమ్ముడికి ఓటు వేయమని చెప్పడం వంద శాతం తప్పేనన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేని కలసినప్పుడు తప్పకుండా చెబుతాం అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ కూడా తప్పు చేశారు కాబట్టి సస్పెండ్ చేయాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇద్దరు కలసి హత్ సే హత్ జోడో యాత్ర చేయాలని, రెండు నెలల తర్వాత కూడా పాదయాత్ర చేయాలని కోరినట్లు తెలిపారు. కమిటీల వ్యవహారంలో తనకు భాద కలిగింది అందుకు నా పదవికి రాజీనామా చేశానని కొండా సురేఖ వెల్లడించారు.
కీలకమైన కమిటీలలో అవకాశం దక్కకపోవడంతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ ఇటీవల రాజీనామా చేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితో ఆమె రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటే జూనియర్లకు స్థానం కల్పించారని ఆమె వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడం అవమానించడమేనని కొండా సురేఖ తెలిపారు.
కొండా సురేఖ వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి వరంగల్ లో కీలక నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గతంలో ఆమె మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొండా సురేఖ.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆమెకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించారు. తాజాగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ అసంతృప్తికి గురయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు.
తాను 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా, ఎమ్మెల్యేగా 4 సార్లు, ఓసారి మంత్రిగా చేశానని, తన భర్త కొండా మురళీ 1988 నుంచి పాలిటిక్స్ లో ఉన్నారని.. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొండా దంపతులకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే పని చేయలేదు. సొంత ఖర్చులతో కూడా నియోజకవర్గాల్లో పనులు చేశాం. కానీ తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేదని, కనీసం వరంగల్ జిల్లాకు చెందిన ఒక్క నేత పేరు లేకపోవడం మనస్తాపాన్ని కలిగించిందని ఆ లేఖలో రాశారు. జూనియర్ నేతలను సైతం కమిటీలో అవకాశం కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను, ఎమ్మెల్యేగా సైతం ఎన్నిక కాని వారిని నామినేట్ చేసిన కమిటీలో తనను కూడా నామినేట్ చేయడం తనను అవమానించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు
BJP On Jagan : దివాలా తీసిన కంపెనీ ఉద్యోగుల్లా ఏపీ ఉద్యోగుల పరిస్థితి - ప్రభుత్వ తీరుపై బీజేపీ విమర్శలు
వైఎస్ఆర్సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి