అన్వేషించండి

Kishan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు లేవు - తేల్చేసిన కిషన్ రెడ్డి !

BJP JanaSena alliance : లోక్ సభ ఎన్నికల్లో జనసేతో పొత్తులు లేవని కిషన్ రెడ్డి తేల్చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.

no alliance with Janasena :   జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయని  చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనూ చర్చనీయాంసం అవుతున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన  బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని అనుకోలేదు.  తన పార్టీ తరపున 32స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రాయబారం చేసుకుని ..  జనసేనకు ఎనిమిది సీట్లు ఆఫర్ చేసి.. పొత్తులు పెట్టుకున్నారు.  

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు.   తెలంగాణలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఇమేజ్ కలిసి వస్తుందనుకుని పొత్తు పెట్టుకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. జనసేనతో పొత్తు వల్ల ఇరు పార్టీలకు మేలు జరగలేదు. జనసేన పార్టీ పోటీ చేసిన  ఎనిమిది చోట్లా బీజేపీ కార్యకర్తలు జనసేనకు మద్దతు ఇవ్వలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సంప్రదాయంగా  బీజేపీ ఓటు బ్యాంక్ కూడా జనసేనకు అనుకూలంగా రాలేదు.  తాండూరు లాంటి చోట్ల గతంలో బీజేపీకి పది వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓటు బ్యాంక్ బదిలీ కాలేదు. కూకట్ పల్లిలోనూ అంతేనన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ కారణంగానే జనసేనతో పొత్తు విషయంపై కిషన్ రెడ్డి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి ఉన్నామని చెబుతూంటారు కానీ.. ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సమయంలో ఏర్పడిన పొత్తు ఏపీకి కూడా వస్తుందని పవన్ మనసు మార్చుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో ఏపీలో కూడా ఇక బీజేపీతో కలిసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ నంచి బయటకు రాలేదు. 

కానీ పొత్తుల గురించి జాతీయ పార్టీ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ పొత్తుల వల్ల పరస్పర ఉపయోగం ఉంటేనే... బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తందని. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కలగనందున జనసేన పార్టీకి సీట్లు కేటాయించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేమని.. ఎన్నికలకు ముందే కలిసి పని చేస్తామా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.                                  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget