అన్వేషించండి

Why KCR Silent : మళ్లీ కేసీఆర్ మౌనవ్యూహం - టార్గెట్ మునుగోడా ? కేటీఆర్‌ను సీఎం చేయడమా ?

కేసీఆర్ మళ్లీ మౌనవ్యూహం పాటిస్తున్నారు. తర్వాత ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటి ?

Why KCR Silent :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా మాట్లాడినా.. ఏమీ మాట్లాడకపోయినా రాజకీయమే.  కేసీఆర్ మౌనం తర్వాత ఒక్కో సారి కీలక నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు. తన మౌనంపై అదే పనిగా చర్చ జరిగిన తర్వాత అసలు విషయం బయటపెడతారు. విజయదశమికి  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ లాంఛనంగా నిర్ణయం తీసుకున్నప్పటకీ ఆయన మీడియాతో మాట్లాడలేదు. ప్రజలకు చెప్పాల్సింది చెప్పలేదు. అలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నాక.. ప్రజలకు చెప్పక ఎవరికి చెబుతారనే సందేహం మొదటగా వస్తుంది. కానీ కేసీఆర్ మౌన వ్యూహం పాటిస్తున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీ వెళ్లి వచ్చారు. వచ్చీ రాగానే మునుగోడు ఎన్నికలపై సమీక్ష చేశారు. ఈ లోపే కేసీఆర్ కేబినెట్‌లోని కీలక మంత్రి తర్వాత కేటీఆరే సీఎం అనే ప్రకటన చేశారు. ఇదంతా యాధృచ్చికంగా జరిగింది కాదని.. పక్కా వ్యూహమేనని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. 

కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారా ? 

మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీని ఓడించేందుకు ఢిల్లీలో రాజకీయాలు చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అప్పుడు కేటీఆర్ సీఎంగా ఉంటారన్నారు. అంటే... ఈ కేటీఆర్ సీఎం కావడం అన్నది వచ్చే ఎన్నికల తర్వాత కాదు.. కేవలం మునుగోడు ఎన్నికల్లో గెలుపు తర్వాతేనని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు కేసీఆర్ తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, రాజకీయ వ్యూహాలపై అన్ని కసరత్తులు పూర్తి చేశారని.. ఢిల్లీలో వారం రోజుల్లో దీనికి సంబంధించిన పనుల్నే చక్కబెట్టారని టీఆర్ఎస్‌లోని కొన్ని వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇక ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తరహాలోనే పలువురు .. కేటీఆర్ సీఎం నినాదంతో తెరపైకి వస్తారని  భావిస్తున్నారు. 

ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై కేసీఆర్ సమీక్ష !

కేటీఆర్‌ను సీఎం చేసే పాజిటివ్ వాతావరణం  ఉండాలన్నా.. వచ్చే ఎన్నికల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగాలన్నా  మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపే అత్యంత కీలకం. అందుకే సీఎం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మునుగోడులో జరుగుతున్న పరిణామాలు.. వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమాలోచనలు చేశారు. ఎన్నికల సంఘం గతంలో కారును పోలిన గుర్తులను ఇతరులకు ఇవ్వబోమని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి వ్యతిరేకంగా గుర్తులను కేటాయించింది. అలాగే గొర్రెలను పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఈ అంశాలపై పోరాటం చేయాలని ..తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అలా అయితేనే మునుగోడులో ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. 

ఢిల్లీలో ఈసీ ముందు ధర్నాకు కేసీఆర్  ప్రయత్నాలు !?

కేంద్రం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని.. ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం  చేస్తోందని కేసీఆర్ నమ్ముతున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల విషయంలోనే ఈసీ తీరును ఎక్స్ పోజ్ చేయాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఈసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నారు. అది మునుగోడు పోలింగ్ లోపే ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లవుంది. పైగా ఈసీ  వ్యవహారంపై బీజేపీయేతర రాష్ట్రాల్లో అభ్యంతరాలున్నాయి. గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించకుండా ఒక్క హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే షెడ్యూల్ ప్రకటించడంపైనా విమర్శలున్నాయి. వీటన్నింటికీ కలిసి వచ్చేలా ఈసీ ఎదుట ధర్నాకు కేసీఆర్ రెడీ అవుతున్నారని అంటున్నారు. 

కేసీఆర్ మౌనం సైలెంటే కానీ.. ఆ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు వయోలెంట్‌గా ఉంటాయని చెబుతూంటారు. ఇప్పుడు మౌనం తర్వాత కేసీఆర్ వేయబోయే అడుగులు రాజకీయంగా కలకలం రేపడం ఖాయమనే నమ్మకానికి ఎక్కువ మంది వచ్చారు. ఆయనేం చేయబోతున్నారో వచ్చే వారంలో తేలే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget