Election Politcs : ఇప్పుడు కర్ణాటక - తర్వాత తెలంగాణ ! ఎన్నికల రాజకీయాల్లో ఈ ట్విస్ట్‌లు ఊహించడం కష్టమే..
పొరుగు రాష్ట్రాల్లోనూ రాజకీయం మార్చనున్నాయి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు. ఏపీ తెలంగాణ రాజకీయాల్లోనూ కర్ణాటక ఎన్నికలు కీలకం అయ్యాయి.
Election Politcs : కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూంటే తెలంగాణలో హడావుడి కనిపిస్తోంది.ఎందుకంటే అక్కడ వచ్చే ఫలితం తెలంగాణలో ప్రభావం చూపిస్తుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ఇదే ఫార్ములాను వర్కవుట్ చేస్తే.. రేపు తెలంగాణలో ఎన్నికలు జరిగేటప్పుడు .. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించబోతోంది. తెలంగాణలో ఎవరు గెలిస్తే..దాన్ని బట్టి రాజకీయం మారుతుందనే అంచనాలు ప్రారంభమవడమే దీనికికారణం.
కర్ణాటకలో గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్ ఆశలు
పొరుగు రా ష్ట్రం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్నా యి. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పా టు- చేస్తామన్న ధీమాను బీజేపీ నమ్మకంతో ఉంది. తెలంగాణలో పాగావేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి కర్ణాటకలో విజయం కీలకం. కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కల్లో సత్తా చాటితే ఆ ప్రభావం తెలంగాణపై పడు తుందని.. తద్వారా పార్టీలో చేరికలు వేగవంతం అవు తాయని ఆ పార్టీ నమ్ముతోంది. కర్ణాటకలో కాం గ్రెస్ విజయం సాధిస్తే తెలంగాణలోనూ పాగా వేస్తా మని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కర్ణాటక లోని 50కి పైగా అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలుగు వారి ప్రాబల్యం గణనీయంగా ఉంటు-ందని, ఈ నియో జక వర్గాల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపి తే అక్కడ ఆ పార్టీల అభ్యర్థులు విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని రాజకీయ పండితులు విశ్లేషించి చెబుతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపోటముల్ని బట్టి తెలంగాణలో మారనున్న రాజకీయాలు
కర్ణాటకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ బలహీనపడుతుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనూ పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతోందని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నాయి. ప్రజల్లో తమ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడు తుందని, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ప్రణా ళికల్లో కాషాయ నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ లో ఉత్సాహం పెరుగుతుంది. , ఆ ప్రభావం బీజేపీపై పడుతుంది. బీజేపీలో చేరికలు తగ్గిపోతాయి. కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరుగుతుంది. కర్ణాటక తరువాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అక్కడ గెలిచి ఇక్కడ ఊపు తీసుకురావాలని కాంగ్రెస్, కమలం పెద్దలు ఆలోచనతో ఉన్నట్టు పార్టీ వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి.
తెలంగాణలో ఏర్పడబోయే ప్రభుత్వం విషయంలోనూ ఏపీలోపై ప్రభావం !
కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఏర్పడితే.. తెలంగాణలో వారికి అడ్వాంటేజ్ ఉండవచ్చు. ఇదే తరహా వాతావరణం ఐదు నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనా పడనుంది. ఎందుకంటే తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం.. ఖచ్చితంగా ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్నారు. గతంలో జరిగింది. ఏపీ కంటే ఐదు నెలలు ముందుగానే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ముందుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఏపీలో వైసీపీ కి అన్ని విధాలుగా సహకారం అందించింది. ఆ విషయం బహిరంగరహస్యమే. మరోసారి కూడా ఏపీలో వైసీపీ రావాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది. మూడో సారి తెలంగాణలో కేసీఆర్ విజయం సాధిస్తే..ఏపీలో వైసీపీకి మేలు జరుగుతుందని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. మాత్రం జగన్ కు గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ సహకారం అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిమితం కావడం లేదు. సరిహద్దు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఎన్నికలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి.