అన్వేషించండి

ఉత్తరాంధ్రపై పవన్‌ ఫోకస్‌, అర్ధరాత్రి వరకు నేతలతో మంతనాలు

Pawan focus on Uttarandhra:జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టి పార్టీని బలోపేతం చేయడంపై చర్చించేందుకు పవన్‌ విశాఖకు వచ్చారు. 

Pawan Uttarandhra Tour: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఒకవైపు పొత్తుల వ్యవహారాన్ని తేల్చే దిశగా అడుగులు వేస్తున్న జనసేన అధినేత.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాలు, క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలాన్ని తెలుసుకునే దిశగా చర్యలను ప్రారంభించారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రపై పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. ఈ ప్రాంతంలో జనసేనకు బలం ఉంది. కానీ, బలమైన నాయకులు లేరని పవన్‌ ముందు నుంచి భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి జనసేనలోకి రావాలనుకునే వారికి పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొణతాల, పంచకర్ల, వంశీ వంటి నేతలు చేరారు. రానున్న రోజుల్లో మరింత మంది చేరే అవకాశముంది. అటువంటి వారిని చేర్చుకునేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్‌ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపైనా నేతలతో చర్చించేందుకు పవన్‌ విశాఖ పర్యటనకు ఆదివారం రాత్రి వచ్చారు. 

కీలక నేతలతో మంతనాలు

అర్ధరాత్రి 7.30 గంటలకు విశాఖ వచ్చిన పవన్‌ కల్యాణ్‌ అర్ధరాత్రి దాటినంత వరకు నేతలతో చర్చలు జరిపారు. విమానాశ్రయం నుంచి నేరుగా మాజీ మంత్రి కొణతాల ఇంటికి వెళ్లిన పవన్‌.. అక్కడ సుమారు గంటపాటు చర్చలు అనంతరం నోవాటెల్‌కు వెళ్లారు. నోవాటెల్‌లో పార్టీ కీలక నేతలతో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తీసుకోబోయే సీట్లు, ఏయే నేతలకు అవకాశాలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉందన్న అంశాలపై తన మనసులోని మాటను, పొత్తులో భాగంగా లభించేందుకు అవకాశాలు ఉన్న సీట్ల గురించి పవన్‌ చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. టికెట్లు రాని నేతలు కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పని చేయాల్సిందిగా పవన్‌ సూచించారు. అటువంటి నేతలకు భవిష్యత్‌లో అండగా ఉంటానని పవన్‌ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. 

నియోజకవర్గాల వారీగా సమీక్ష

సోమవారం నుంచి నియోజకవర్గాలు వారీగా పవన్‌ కల్యాణ్‌ సమీక్షించనున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో పవన్‌ కల్యాణ్‌ విడివిడిగా భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నేతలకు సమాచారాన్ని అందిచంఆరు. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో పవన్‌తోపాటు జనసేన కీలక నేత నాగబాబు పంచకర్ల రమేష్‌బాబు, శివ శంకర్‌, కోన తాతారావు, సుందరపు విజయ్‌ కుమార్‌, వంశీ కృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, బొలిశెట్టి సత్యనారాయణ, డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు, కందుల నాగరాజు తదితర నేతలు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Kavitha vs Harish Rao : హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
Telangana Phone Tapping Case: ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
Delimitation Bill 2026: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
Sonia Gandhi Memoir Controversy: సోనియా ఆత్మకథ బిలాంగింగ్ చుట్టూ రాజకీయం.. క్విక్ కామర్స్‌లో విక్రయాలతో కాంగ్రెస్‌కు సానుభూతి వస్తుందా?
సోనియా ఆత్మకథ బిలాంగింగ్ చుట్టూ రాజకీయం.. క్విక్ కామర్స్‌లో విక్రయాలతో కాంగ్రెస్‌కు సానుభూతి వస్తుందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget