అన్వేషించండి

YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?

Andhra Pradesh : లడ్డూ వివాదానికి తోడు డిక్లరేషన్‌ను తెచ్చుకోవడం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తిరుమల పర్యటన వాయిదా వేసుకోవడానికి డిక్లరేషనేనని అనుకుంటున్నారు.

Jagan has scored a self-goal by bringing the topic of declaration along with the laddu controversy : రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని తన  వ్యూహాలతో తప్పులు చేసేలా చేయడం కూడా ఓ కళే. ఆ తప్పులు పదే పదే చేసే నేతల్ని అనుభవజ్ఞులైన నేతలు ఓ ఆట ఆడుకుంటారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలలతో  టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనకు రాజకీయ సలహాలు ఇచ్చేవారు అంత వేగంగా .. చంద్రబాబు వేగాన్ని అందుకునేలా కౌంటర్ రెడీ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వైసీపీ క్యాడర్ లో ఏర్పడుతోంది. 

జగన్ తిరుమల ప్రకటనే  వ్యూహత్మక తప్పిదం 

తిరుమలలో లడ్డూ కల్తీ అంశం హాట్ టాపిక్ గా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రక్షణ అని.. ఆలయాల సందర్శన చేసి ప్రాయశ్చిత్తంగా శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టారు. దీంతో వైసీపీ కౌంటర్ ఇవ్వాలన్న లక్ష్యంతో పాపప్రక్షాళన పేరుతో పూజలు చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. అంత వరకూ బాగానే ఉన్నా..జగన్ తిరుమల పర్యటనకు వెళ్తారని ప్రకటించడంతో అందరూ  వైసీపీ నేతలు ఉలిక్కి  పడ్డారు. అంత కంటే కావాల్సిందేముందని కూటమి నేతలు రాజకీయం ప్రారంభించారు. వైసీపీ నుంచి అలా ప్రకటన వచ్చిన వెంటనే డిక్లరేషన్ పై సంతకం అంశాన్ని తెరపైకి తెచ్చారు. జగన్ నేరుగా తిరుమలకు కాకుండా.. తాడేపల్లి నుంచి తామే కట్టించామని చెప్పుకున్న అమరావతిలో టీటీడీ ఆలయానికి వెళ్లి పూజలు చేయాలని నిర్ణయించుకుంటే ఇంత రాజకీయం జరిగి ఉండేది కాదు. 

'దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని ఎవరు చెప్పారు' - వైఎస్ జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

వెళ్లకుండా ఆగిపోవడం మరో మైనస్ !

జగన్ తిరుమల పర్యటనపై చాలా పెద్ద దుమారం రేగింది. హిందూ సంస్థలు ఆందోళనలు చేశాయి. అయినా జగన్ మోహన్ రెడ్డి తిరుమల షెడ్యూల్ ఖరారయింది. ఇక బయలుదేరుతారు అనుకున్న సమయంలో హఠాత్తుగా రద్దు ప్రకటన వచ్చింది. దీంతో  వైసీపీ క్యాడర్  కూడా పడిపోయింది. ఎందుకంటే.. జగన్ తిరుమల పర్యటనకు వెళ్తే అక్కడ ఆయనను ఎవైరనా అడ్డుకుంటే వచ్చే ఎఫెక్ట్ వేరు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం ఎన్నో సార్లు అడ్డుకుంది. ప్రతీ సారి చంద్రబాబు అలా అడ్డుకోవడాన్ని అడ్వాంటేజ్ గా తీసకుని రాజకీయంగా ప్రయోజనం పొందారు. జగన్ ఇంకా సున్నితమైన అంశంపై రాజకీయం చేస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే దేవుడి దగ్గరకు పోనివ్వలేదని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశాన్ని జగన్ మిస్సయ్యారు. 

డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే వెళ్లలేదని టీడీపీ , హిందూ సంస్థల ప్రచారం

జగన్ కు ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని కూటమి  పార్టీ నేతలు నిర్ణయించారు. ఎవరైనా నిరసన వ్యక్తం చేయాలనుకున్నా అది రోడ్ సైడే అని డిసైడయ్యారు. ఎవరైనా హిందూ సంఘాలు అడ్డుకుంటారేమోనని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్ ను కూడా సిద్ధం చేశారు. ఇక జగన్ వస్తే నేరుగా కొండ మీదకు తీసుకెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ జగన్ రాలేదు. దీనికి కారణం ఎవరూ అడ్డుకోరు సరి కదా.. పైకి తీసుకెళ్లి డిక్లరేషన్ అడుగుతారని ఆయన ఆగిపోయారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. డిక్లరేషన్ ఇస్తే.. తాను క్రిస్టియన్ ను అని అంగీకిరంచినట్లు అవుతుంది. అలాగే తన ఓటు బ్యాంకుకు ఈ డిక్లరేషన్ అసంతృప్తి కలిగించవచ్చు. అందుకే అంత కన్నా... ఆగిపోవడం ద్వారా జరిగే తక్కువ అని అంచనాకు వచ్చి ఆగిపోయారని టీడీపీ నేతలంటున్నారు. 

Also Read: YS Jagan: 'రాష్ట్రంలో రాక్షస రాజ్యం' - తిరుమల లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ టాపిక్ తెచ్చారన్న జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
Roja Comments: భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
Ponguleti :  పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం - కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం - కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
Roja Comments: భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
Ponguleti :  పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం - కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం - కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
IIFA 2024: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
Rapamycin: రపామైసిన్‌ టాబ్లెట్ తీసుకుంటే వయసు తగ్గుతుందా? ఈ ప్రచారంలో నిజమెంతా?
రపామైసిన్‌ టాబ్లెట్ తీసుకుంటే వయసు తగ్గుతుందా? ఈ ప్రచారంలో నిజమెంతా?
Karnataka Politics : సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
Embed widget