CM Jagan Closing Speeh : మేనిఫెస్టో అమలు చేశామని నమ్మకం కలిగితేనే ఆశీర్వదించండి - ప్రజలకు జగన్ పిలుపు !
మేనిఫెస్టోని అమలు చేశామని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని జగన్ ప్లీనరీలో ప్రజలను కోరారు. ప్లీనరీ ముగింపు ప్రసంగంలో గత ప్రభుత్వం కన్నా తాము ఎక్కువ నిధులు ప్రజలకు ఇచ్చామని లెక్కలు వివరించారు.
![CM Jagan Closing Speeh : మేనిఫెస్టో అమలు చేశామని నమ్మకం కలిగితేనే ఆశీర్వదించండి - ప్రజలకు జగన్ పిలుపు ! Jagan asked the people in the plenary to bless the next election only if they believe that the manifesto has been implemented. CM Jagan Closing Speeh : మేనిఫెస్టో అమలు చేశామని నమ్మకం కలిగితేనే ఆశీర్వదించండి - ప్రజలకు జగన్ పిలుపు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/09029aa435896797faa4dc78fe3c94df1657359547_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan Closing Speeh : భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా..రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నికయ్యారు. ఆ తరవాత ప్రసంగించారు. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారని కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్ అని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవే చేస్తున్నాం. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని ప్రకటించారు.
ఓదార్పు యాత్ర చేస్తున్నానని కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశారన్నారు. తనపై ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారుని.. అలాంటి కుట్రలకు లొంగలేదు కాబట్టే ఇవాళ మీ ఎదుట ఉన్నారన్నారు. వైసీపీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలను కొన్నారో టీడీపీకి అన్ని ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఒక్క ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరిందని గుర్తు చేసుకున్నారు. మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడమే. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరింది’ అని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు రింగ్‌లో చిప్ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా రింగ్‌లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్ ఉంటే సరిపోదు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానం. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతం. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలంట. నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుంది. కానీ, మన ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ తీసుకెళ్లడానికి శ్రమిస్తోంది. ఒక్క విద్యారంగం కోసమే తొమ్మిది పథకాలు తీసుకొచ్చిందన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి జరగాలనే అలా చేశాం. మరింత పాదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. టీడీపీ అంటే పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోట్లు అని సీఎం జగన్ వివరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)