Pawan Sanatana Dharma Politics : పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రాజకీయాలు - వైసీపీ అర్థం చేసుకోలేక ట్రాప్‌లో పడిపోయిందా ?
YSRCP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రాజకీయాలను వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది. లడ్డూ కల్తీ విషయం కాస్తా మెల్లగా పవన్ సనాతన ధర్మం వైపు తీసుకెళ్లారు. ఈ ట్రాప్‌లో వైసీపీ పడిపోయింది.
Pawan Kalyan Sanatana Dharma politics : తిరుమలలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ విషయాన్ని పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వైపు మళ్లించారు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ రోజుకో ఆలయంలో సేవలు చేసిన తరవాత పవన్ ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనలో ఆవేశం కనిపించలేదు. కానీ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన తర్వతా సనాతన ధర్మంపై ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు. పవన్ ఆవేశానికి వైఎస్ఆర్‌సీపీ గట్టిగా సమాధానం ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. గట్టి వాయిస్ లు లేకపోవడమే కారణం. అంబటి రాంబాబు మాట్లాడినా పవన్ స్థాయి కాకపోవడంతో ఫోకస్ రావడం లేదు.
సనాతన ధర్మంపై వైసీపీ దాడి - పవన్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది ఇదే !
లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ సనాతన ధర్మం మీద దాడి చేసిందని పవన్ కల్యాణ్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సెక్యూలరిజం అనేది వన్ వే కాదని... టూ వే అని ఆయన అంటున్నారు. పవన్ కల్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఆయన ఇతర మతాల్ని కించ పరచడం లేదు. తక్కువ చేయడం లేదు. కానీ వారు వారు మతాల్ని ఎలా గౌరవిస్తారో హిందువులు కూడా హిందుత్వాన్ని అలాగే పరిరక్షించుకోవాలి.. కాపాడుకోవాలి అని పిలిపునిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఏపీలో హిందూధర్మంపై దాడి చేస్తోందని ఆయన ఈ కోణంలో ప్రజల్లోకి పంపుతున్నారని అర్థం చేసుకవచ్చు. పవన్ కల్యాణ్‌లో ఈ అగ్రెసివ్ నెస్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నా.. పొలిటికల్ ఇంటెన్షన్ అర్థమైన వారు మాత్రం.. పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ను మనసులో అయినా అభినందించకుండా ఉండలేరు.
వైఎస్ఆర్‌సీపీకి మరో బిగ్ షాక్ - రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా - ఆమోదం కూడా !
జరుగుతున్న నష్టం వైసీపీకి అర్థం కావడం లేదా ?
లడ్డూ వివాదంలో తప్పు ఎవరిది అన్నది దర్యాప్తు సంస్థలు తేల్చేస్తాయి. కానీ ఇప్పటి వరకూ జరిగిన రాజకీయం మాత్రం వైఎస్ఆర్‌సీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. వైసీపీ నాయకత్వం పూర్తిగా క్రిస్టియన్ వర్గానికి చెందిన వారు. ఈ విషయంలో ప్రజల్లో ఓ స్పష్టత ఉంది. అయినప్పటికీ.. క్రిస్టియన్లే కాకుండా ఇతర వర్గాలు కూడా వైసీపీకి మద్దతివ్వడం ద్వారానే నలబై శాతం వరకూ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వివాదం హిందువుల్లో ఆగ్రహం కనిపించడం ఖాయం. జగన్మోహహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో హిందూత్వంపై దాడి చేశారన్న అభిప్రాయం బ లంగా ప్రజల్లోకి పంపేందుకు .. మరోసారి వైసీపీ వైపు వెళ్లకుండా సనాతన ధర్మం వైపు ఉండేలా చేసేందుకు పవన్ గట్టి రాజకీయం చేస్తున్నారు. ఇందులో పవన్ ప్రయత్నాల వల్ల పది శాతం వైసీపీకి ఓటేసిన హిందూ ఓటర్లు మారిపోయినా వైసీపీ పునాదులు కదిలిపోతాయి. మరోసారి అధికారంలోకి రావడం అసాధ్యం. క్రిస్టియన్లు, ముస్లింలలో అత్యధికం వైసీపీకే మద్దతుగా ఉంటారు. కొత్తగా వచ్చే వారు ఉండరు .కానీ మైనస్ అవుతారు. ఈ లాజిక్ ను అర్థం చేసుకోవడంలో వైసీపీ విఫలమైనట్లుగా కనిపిస్తోంది.
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
ఎంతగా వివాదాన్ని సాగదీసుకుంటే వైసీపీకి అంత నష్టం
లడ్డూ వివాదంలో కల్తీ జరగలేదని నిరూపించడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. దీని వల్ల వివాదం అంతకంతూ పెరుగుతోంది. కల్తీ జరగలేదని అనేక నెరెటివ్స్ తెరపైకి తెస్తున్నారు. వాటికి అగ్రెసివ్ గా టీడీపీ జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వం విచారణ చేయిస్తుంది. కోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని వైసీపీ హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లింది. ఈ వివాదాన్ని ఇలా లాగుతూ పోతే...లడ్డూ అంశం రాజకీయంగా నలుగుతూనే ఉంటుంది. దీని వల్ల ఆ పార్టీకి నష్టమే కానీ.. లాభం ఉండదన్న అభిప్రాయం ఉంది . అయితే వైసీపీ వ్యూహకర్తలు ఎదురుదాడికే ప్రాధాన్యం ఇస్తున్నారు.