అన్వేషించండి

YSRCP News : విజయసాయిరెడ్డికి వైసీపీలో పూర్వ వైభవం - జగన్ కీలక బాధ్యతలిచ్చారా ?

వైసీపీలో విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారా?కోస్తాలో కీలక బాధ్యతలు అప్పగించిన జగన్ఇంత కాలం ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ?ఎన్నికలకు ముందు విజయసాయి అవసరాన్ని గుర్తించారా ?

 

YSRCP News :   విజయసాయిరెడ్డి  రెండేళ్ల కిందటి వరకూ వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 స్థానంలో ఉండేవారు. తర్వాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకే పరిమితమవుతూ వస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ రాజకీయాల్లో కీలకమయ్యారని చెబుతున్నారు.  ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని జగన్ నియమించినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన చేయలేదు కానీ..ఆయన మత్రం పనిలోకి దిగిపోయారని అంటున్నాు.  
 
నాలుగు కోస్తా జిల్లాల బాధ్యతలు విజయసాయిరెడ్డి !                              

ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డికి జగన్ బాధ్యతలిచ్చినట్లుగా చెబుతున్నారు.  నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్ ఇటీవలడి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించకుండా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది. వైఎస్ జగన్‌ నమ్మే అతి కొద్ది మందిలో సాయిరెడ్డి మొదటి వ్యక్తని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. పైగా రాజకీయంగా ఆయనకు అపార అనుభవమే ఉందని.. వీటన్నింటికీ మించి ఎలాంటి నేతల మధ్య విబేధాలున్నా ఒకట్రెండు సమావేశాలతోనే కలిపేసే సత్తా కలిగి ఉన్న నేత అని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈయనైతేనే ఈ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలను సమన్వయం చేసుకోగలరని సీఎం విశ్వసిస్తున్నారట. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి చేతికి జగన్ ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాల పగ్గాలిచ్చేశారు.

ఇటీవలి వరకూ పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేని విజయసాయిరెడ్డి                                     

నిజానికి గత ఫిబ్రవరిలో  అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయ కర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు.  ఇంచార్జ్‌ గా  విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కింద కో ఇన్ఛార్జిగా చెవిరెడ్డి ఉన్నారు.  ఇప్పుడు సాయిరెడ్డిని పక్కకు తప్పించి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.  ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి సజ్జల కుమారుడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ పదవి నుంచి సాయరెడ్డిని పక్కన పెట్టడం వైఎస్ఆర్‌సీపీలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవు.ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు నాలుగు జిల్లాల పదవి ఇచ్చారు. 

జగన్ బుజ్జగించారా ?                     

ఇటీవ‌ల విజ‌య‌సాయిరెడ్డిని సీఎం జ‌గ‌న్ పిలిపించుకుని గ‌తంలో మాదిరిగా పార్టీ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో విజ‌య‌సాయిరెడ్డి అవ‌స‌రం పార్టీకి ఎంతో అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ గుర్తించారని అంటున్నారు.  ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి ఇవ్వాల‌నే విష‌య‌మై విజ‌య‌సాయిరెడ్డి క‌స‌ర‌త్తు ప్రారంభించారని అంటన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shyam Benegal: భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
TVS Sport: టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shyam Benegal: భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
TVS Sport: టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Embed widget