అన్వేషించండి

AP BJP : ఏపీ బీజేపీకి షాకులిస్తున్న హైకమాండ్ - వైఎస్ఆర్‌సీపీపై పోరాటంలో సహకారం అందడం లేదా ?

ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ సహకరించడం లేదా ? పురందేశ్వరి వైసీపీ సర్కార్‌పై చేసిన ఆరోపణలకు భిన్నంగా నిర్మలా సీతారామన్ ఎందుకు ప్రకటన చేశారు ?


AP BJP :   తమిళనాడులో బీజేపీ పుంజుకుంటోంది. నిజానికి తమిళనాడు అంటే కొన్ని ప్రత్యేమైన భావజాలాలు ఉండే రాష్ట్రం. అక్కడ బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమన్న అభిప్రాయం ఉండేది. కానీ మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆ పార్టీ రాత మారిపోయింది. ప్రజల్లో క్రేజ్ పెరిగింది. అక్కడ అన్నామలై పార్టీని అభివృద్ధి చేస్తున్నారు. ఇందు కోసం ఆయన డీఎంకే  ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. డీఎంకే ఫైల్స్ పేరుతో డాక్యుమెంట్లు రిలీజ్ చేస్తున్నారు. మరి ఏపీలో మరో అన్నామలై ఎందుకు ఎదగలేకపోతున్నారు. .? దీనికి ఖచ్చితంగా హైకమాండే కారణం అని చెప్పకతప్పదు. 

తమిళనాడులో  బీజేపీకి సహకరిస్తున్న హైకమాండ్ 
 
అన్నామలై.. మాజీ ఐపీఎస్ అధికారి, సర్వీసులో ఉన్నప్పుడు ఆయన కర్ణాటకలో పని చేశారు. తర్వాత రాజకీయాలపై ఆసక్తితో వెంటనే సర్వీసు వదిలేశారు. ఆయనపై హైకమాండ్ నమ్మకం పెట్టుకుంది. అందుకే అవకాశం ఇచ్చింది. యువకుడిగా చురుగ్గా ఉండే అన్నామలై పార్టీ విధానాలకు అనుగుణంగా  అవకాశాలు సృష్టించుకుని ముందుకు దూసుకెళ్లారు. అదే సమయంలో ఆయనకు  హైకమాండ్ నుంచి కావాల్సినంత మద్దతు లభించింది. ఆయన ఏమడిగినా చేసి పెట్టింది. డీఎంకే అవినీతిపై పోరాటం అంటూ కొంత మంది జాబితా రిలీజ్ చేసి వారిపై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని ప్రకటించారు. అన్నట్లుగానే దాడులు జరుగుతున్నాయి. దీంతో అన్నామలైకు క్రేజ్ మరింత పెరిగింది.  డీఎంకేపై బీజేపీనే పోరాడుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. 

ఏపీలో హైకమాండ్ నేతలకు సహకరిస్తోందా ? 

తమిళనాడులో బీజేపీ శాఖకు సహకరిస్తున్నట్లుగా సహకారం కాదు కదా..  అసలు రివర్స్‌లో వైసీపీకి సహకరిస్తున్నారన్న అసంతృప్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా  పురందేశ్వరి బాధ్యతలు చేపట్టగానే దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఆర్థిక అవకతవకలపై ప్రశ్నిస్తున్నారు. రూ. పది లక్ష కోట్లకుపైగా అప్పులు చేశారని లెక్కలు చెప్పారు. అయితే  పురందేశ్వరి చేసిన ఆరోపణలను .. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఖండించారు. అప్పులు నాలుగేళ్లలో రూ. లక్షా 70 వేల కోట్లే అప్పు తీసుకున్నారని ప్రకటించారు. నేరుగా కాకపోయినా ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాదానంతో  వైసీపీకి మేలు చేసినట్లయింది. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. పాపం పురందేశ్వరి అని రాజకీయవర్గాలు అనుకున్నాయి. 

పరిమితమైన సమాచారం ఇచ్చిన నిర్మలా సీతారామన్ 

 ఏపీ ప్రభుత్వ అప్పులు బహిరంగ రహస్యం. కార్పొరేషన్లు, మద్యం బాండ్లు,  ఆస్తులు తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణాలు  తెచ్చారు.  అయినా వీటి గురించి ఏమీ తెలియనట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పడంతో.. పురందేశ్వరికి సపోర్ట్ కాదు కదా మోరల్‌గా దెబ్బతీసినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ముందుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ ఓ స్పష్టతకు రావాలని.. ఆ తర్వాతే.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలని అంటున్నారు. ఏపీలో అన్ని రకాల అక్రమాలు జరుగుతున్నాయని పోరాటం చేయాలని సూచించడం… మళ్లీ ఆ అక్రమాలపై ప్రశ్నిస్తే.. కేంద్రమే అధికార పద్దతుల్లో  బీజేపీ వాదనను ఖండించేలా   సమాచారం రిలీజ్ చేయడం అంటే సొంత నేతల్ని కించపర్చడమేనని గుర్తు చేస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget